Ajinkya Rahane react on KKR, DC opportunities in IPL 2023: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023లో టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే దుమురేపుతున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రహానే పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తూ చెన్నైకి అద్భుత విజయాలు అందిస్తున్నాడు. క్రీజులో వచ్చినప్పటి నుంచే ఎడాపెడా బౌండరీలు బాదేస్తున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందిస్తున్నాడు. అదేసమయంలో జింక్స్ బ్యాటింగ్ చూసి ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అజింక్య రహానే 2020-21ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే రెండు జట్లు కూడా రహానేకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. కేవలం 7 మ్యాచ్‌లే ఆడిన జింక్స్.. 104 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2020వ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడగా.. 2021లో రెండు మ్యాచ్‌ల్లోనే బరిలోకి దిగాడు. 2023లో మాత్రం 5 మ్యాచులు ఆడి 209 రన్స్ చేశాడు. దాంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023లో భారత జట్టుకు ఎంపికయ్యాడు.
ఐపీఎల్ అవకాశాలపై అజింక్య రహానే తాజాగా స్పందిస్తూ... 'నాకు అవకాశాలు ఇవ్వకపోతే సత్తా ఏంటో ఎలా చూపించాలి. 1-2 ఏళ్ల క్రితం నాకు ఆడే అవకాశం రాలేదు. మ్యాచ్‌లు ఆడకపోతే మీ ప్రదర్శన ఎలా చూపుతారు. స్థిరంగా ఆడకపోతే మీ సత్తా ఏంటో నిరూపించలేరు' అని అన్నాడు. 'ఈ సీజన్లో నా ప్రదర్శనను ఆస్వాదిస్తున్నా. ఇంకా తన ఉత్తమ ప్రదర్శన రాలేదని భావిస్తునా. మా ఆట తీరు మెరుగుపడటానికి చెన్నై జట్టు, కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణం. జట్టు కోసం ఎలా ఆడాలనేదానిపైనే ఎక్కువగా ఆలోచిస్తా. నా గురించి, ఫలితాల గురించి ఎక్కువగా దృష్టిపెట్టను' అని జింక్స్ తెలిపాడు.
గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన అజింక్య రహానేను ఆ జట్టు ఈసారి వేలంలోకి విడుదల చేసింది. డాడీస్ ఆర్మీగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ. 50 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ప్రస్తుతం జింక్స్ దుమ్మురేపుతున్నాడు. ఈ తాజా ప్రదర్శనతో రహానేకు ఏకంగా భారత జట్టులో చోటుదక్కింది. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం దక్కింది. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.