Intermediate Students Suicide: తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ ల్లో విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రైవేట్ కాలేజ్ లకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ మార్గదర్శకాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.. కానీ మార్గదర్శకాల్లో కఠిన నిర్ణయాలు, విద్యార్థల యొక్క ఆత్మహత్య లు తగ్గించే మార్గదర్శకాలు కనిపించడం లేదు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఒత్తిడి నుండి తగ్గించడం మాత్రమే కాకుండా ప్రైవేట్ కాలేజ్ ల యొక్క ఆగడాల విషయాలపై కూడా శ్రద్ద పెట్టిన సమయంలోనే విద్యార్థుల ఆత్మహత్య లు ఆగుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రైవేట్ కాలేజ్ లకు వచ్చే విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ బోర్డ్ కొత్త మార్గదర్శకాలు..
- ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే క్లాస్ లు నిర్వహించాలి
- ప్రతి రోజు 8 గంటల పాటు నిద్రకు సమయం ఇవ్వాలి. పరీక్షల సమయంలో కూడా 8 గంటలు నిద్రకు టైమ్ ఇవ్వాల్సిందే
- ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలకు మరియు టిఫిన్ కు గంటన్నర సమయం కేటాయించాలి
- లంచ్ మరియు డిన్నర్ కి 45 నిమిషాల నుండి గంట విరామం ఉండాలి.
- ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి రెండు సార్లు వైద్య పరీక్షలను కాలేజ్ యాజమాన్యం చేయించాలి
- పరీక్షల సమయంలో అదనంగా తరగతులు నిర్వహించాలంటే 3 గంటలకు మించకుండా చూసుకోవాలి
- విద్యార్థులకు సాయంత్రం సమయంలో కనీసం గంట పాటు లీజర్ అవర్ ను కేటాయించాలి
- ప్రతి క్యాంపస్ లో కూడా తగినంత సిబ్బంది ఉండాలి.. హాస్టల్ వార్డెన్ లు కూడా తప్పనిసరిగా ఉండాలి.
- విద్యా సంవత్సరం ప్రారంభంలో నియమించుకున్న సిబ్బంది విద్యాసంవత్సరం పూర్తి అయ్యే వరకు ఉండేలా చూసుకోవాలి
- ప్రతి కాలేజ్ కి ఒక పర్మిమెంట్ ఫోన్ నెంబర్ ను పెట్టుకోవాలి
- ఇంటర్ బోర్డ్ ఆదేశాలను మరియు క్యాలెండర్ ను తప్పనిసరిగా పాటించాల్సిందే
- విద్యార్థులు కాలేజ్ ను మానుకోవాలనుకుంటే ఫీజ్ ను తిరిగి ఇవ్వాలి.
ఇన్ని గైడెన్స్ ఇచ్చిన ఇంటర్ బోర్డ్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై పేర్కొనలేదు. ఏ క్యాంపస్ లో అయితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారో ఆ కాలేజ్ గుర్తింపును రద్దు చేస్తామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించి ఉంటే మరింత జాగ్రత్తగా కాలేజ్ యాజమాన్యాలు ఉంటాయని సామాన్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.