Tammareddy : రాజమౌళికి వంద, త్రివిక్రమ్‌కి యాభై కోట్లు.. నేను సూసైడ్ చేసుకున్నానా?.. ఢీ షో మాస్టర్ మృతిపై తమ్మారెడ్డి

Dhee Master Chaithanya Suicide ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. జబర్దస్త్, ఢీ షో మెంబర్స్ చైతన్య మాస్టర్ మృతి మీద సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 03:08 PM IST
  • నెట్టింట్లో చైతన్య మాస్టర్‌పై సంతాపం
  • మల్లెమాల రెమ్యూనరేషన్‌ మీద టాక్
  • తమ్మారెడ్డి భరద్వాజ్ కామెంట్లు వైరల్
Tammareddy : రాజమౌళికి వంద, త్రివిక్రమ్‌కి యాభై కోట్లు.. నేను సూసైడ్ చేసుకున్నానా?.. ఢీ షో మాస్టర్ మృతిపై తమ్మారెడ్డి

Tammareddy on Mallemala Remuneration తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఢీ కొరియోగ్రఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్ మీద స్పందించాడు. ఆయనకు ముందు చేసిన అప్పులేమైనా ఉన్నాయో ఏమో మరి.. అయినా అలా సూసైడ్ చేసుకోవడం తప్పు అని అన్నాడు. ఇక ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్‌లు ఇస్తున్నారు.. జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తున్నారని అనడం తప్పు.. ఏ షోను బట్టి ఆ షోకు.. దాని స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది.. నాకు తెలిసి ఢీ షోలోనూ బాగానే ఇస్తుంటారు.. రాజమౌళికి వంద కోట్లు ఇస్తున్నారు.. త్రివిక్రమ్‌కి యాభై కోట్లు ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వరు అని నేను సూసైడ్ చేసుకుంటానా? అది చాలా తప్పు అంటూ ఇలా తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.

ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్ అని జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తున్నారంటూ.. ఢీ వల్ల ఫేమ్, నేమ్ వచ్చింది కానీ డబ్బులు రాలేదని సూసైడ్ వీడియోలో చైతన్య మాస్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మల్లెమాల రెమ్యూనరేషన్ల మీద మరోసారి చర్చలు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇలా తమ్మారెడ్డి భరద్వాజ్ జీ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. సూసైడ్ చేసుకోవడం తప్పు అని, అలా రెమ్యూనరేషన్లు పోల్చుకోవడం కూడా తప్పేనంటూ చెప్పుకొచ్చాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News