Besan Benefits: వేసవిలో ముఖ సౌందర్యం కోసం శెనగపిండి అత్యుత్తమ విధానమంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ సౌందర్యాన్ని పరిరక్షించడమే కాకుండా ఎండ వేడిమి నుంచి సైతం చర్మాన్ని సంరక్షిస్తుంది. అందుకే శెనగపిండిని సౌందర్య సాధనలో విరివిగా ఉపయోగిస్తుంటారు.
చర్మాన్ని శుభ్రపర్చేందుకు, ట్యానింగ్ ప్రక్రియలో, సౌందర్య సాధనంగా శెనగపిండి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనాది వినియోగిస్తున్నదే. అసలు ముఖానికి శెనగపిండి రాయడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం. శెనగపిండి చర్మం లోతుల వరకూ వెళ్లి క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషక పదార్ధాలతో చర్మానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చర్మానికి పోషకాలు అందించడంతో పాటు ఇన్‌ఫెక్షన్ దూరం చేస్తుంది. వర్షాకాలంలో సహజంగానే చర్మం ఆయిలీగా ఉంటుంది. ఆ సమయంలో కూడా చర్మాన్ని శెనగపిండితో క్లీన్ చేస్తే ఆయిలీ కాకుండా ఉంటుంది.
ముఖంపై శెనగపిండి రాయడం వల్ల పింపుల్స్, యాక్నే సమస్య దూరమౌతుంది. శెనగపిండిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మానికి శెనగపిండి రాయడం వల్ల చర్మం లోపలి వరకూ శుభ్రమౌతుంది. ఫలితంగా పింపుల్స్, యాక్నే వంటి సాధారణ సమస్యలు తలెత్తవు. ఒకవేళ ఉంటే తొలగిపోతాయి.
డెడ్ సెల్స్ తొలగింపు
ముఖానికి శెనగపిండి రాయడం వల్ల ముఖం శుభ్రమౌతుంది. శెనగపిండిలో ఉండే ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ చర్మపు డెడ్ స్కిన్ తొలగించేందుకు దోహదపడుతుంది. శెనగపిండి ఓ ప్రాకృతిక బ్లీజ్ లాంటిది. ఇది రాయడం వల్ల చర్మం రంగు వికసిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా రాస్తే ముఖానికి నిగారింపు వస్తుంది.
ఆయిలీ స్కిన్
శెనగపిండి రాయడం వల్ల ముఖంపై ఉండే అదనపు ఆయిల్ తొలగించి శుభ్రం చేస్తుంది. శెనగపిండి సహజసిద్ధమైన పద్ధతిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా దోహదపడుతుంది. శెనగపిండిని ఏ సమయంలోనైనా రాయవచ్చు. శెనగపిండి రాయడం వల్ల చర్మం శుభ్రమై...మృదువుగా మారుతుంది.
Also read: Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోందా, ఈ సంకేతాలుంటే తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook