Adani-Hindenburg Issue: అదానీ-హిండెన్‌బర్గ్ అంశంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు, సెబీకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు

Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెబీకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. అటు సుప్రీంకోర్టు సైతం ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2023, 01:03 PM IST
Adani-Hindenburg Issue: అదానీ-హిండెన్‌బర్గ్ అంశంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు, సెబీకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు

Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్ అవకతవకలు, ఎక్కౌంటింగ్ మోసాలు, కృత్రిమ షేర్ విలువలు, మనీ లాండరింగ్‌పై హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. అదానీ సంపద ఒక్కసారిగా ఆవిరైంది. షేర్ హోల్డర్లు నట్టేన మునిగిపోయారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించిన సుప్రీంకోర్టులో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

హిండెన్‌బర్గ్ ఆరోపణలు, అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేసి రెండు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇందుకు నిపుణుల కమిటీని సైతం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై విచారణకు మరో 6 నెలల సమయం కావాలని సెబీ సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. అయితే పిటీషనర్ మాత్రం ఇందుకు వ్యతిరేకించారు. దర్యాప్తు కాల పరిమితి పొడిగించడం వల్ల కేసు దర్యాప్తు ఆలస్యమౌతుందని పిటీషన్‌లో పేర్కొంటూ..సెబీ విచారణకు మరింత సమయం ఇవ్వవద్దని పిటీషనర్ విశాల్ తివారీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు పిటీషన్ దాఖలు చేశారు. 

వాస్తవానికి ఈ ఏడాది మార్చ్ 2వ తేదీన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై విచారణ చేసి నిజానిజాలు వెలికి తీయాలని సుప్రీంకోర్టు సెబీకు 2 నెలల గడువిచ్చింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రకారం 12 అనుమానాస్పద లావాదేవీలున్నాయని, ఈ లావాదేవీలపై విచారణకు 15 నెలలు పడుతుందని సెబీ తెలిపింది. ఇందులో ఉప లావాదేవీలు చాలా ఉన్నందున పదేళ్లకు పైగా పాత బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు అవసరమౌతాయని తెలిపింది ఇవి పొందేందుకు సయమం పడుతుందని..అందుకే 6 నెలల గడువు ఇవ్వాలని సెబీ కోరింది. 

అయితే సెబీ అభ్యర్ధన, సెబీకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ డాక్యుమెంట్లు సేకరించేందుకు సెబీకు తగిన సమయం ఇప్పటికే ఇచ్చామని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. 

Also read: Banks Five Day Week: బ్యాంకులకు వారానికి ఐదురోజులే పనిదినాలు, కొత్త టైమింగ్స్ ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News