Balakrishna Singing Sivasankari Sivanandalahari Live : నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన పనులన్నీ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. ఆయనకు ముక్కోపి అని అభిమానుల మీద కూడా చేయి చేసుకుంటాడని అపవాదు ఉంది. అలాగే స్టేజి మీద మైకు దొరికితే వదలకుండా వాగ్దాటితో మాట్లాడుతుంటాడు లేదా పాటలు పాడుతూ ఉంటాడు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఆయన పాటిన పాటలు ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటాయి.
కానీ తాజాగా తనలో ఉన్న గాయకుడిని బయటపెట్టిన బాలకృష్ణ అందరి చేత ప్రశంసలు పొందారు. అరబ్ దేశమైన దోహాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన లైవ్ లో పాట పాడి అక్కడ ఉన్న ప్రేక్షకులందరినీ అలరించారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కతార్ దేశంలోని దోహాలో శుక్రవారం నాడు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Also Read: Producer Chinnappa Thevar: ఒకప్పుడు 9 రూపాయల కూలీ.. కానీ చొక్కా వేసుకోకుండా 50 సినిమాలు నిర్మించాడు!
మీ తండ్రి గారి పాటల్లో ఏదో ఒక పాట పాడి వినిపించమని కోరగా ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమా నుంచి శివశంకరి అనే పాటను పాడి వినిపించారు నందమూరి బాలకృష్ణ. ఆయన పాటకు ఫిదా ఆయన అక్కడి ప్రేక్షకులు చప్పట్లతో తన అభిమానాన్ని చాటటమే కాదు అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిజానికి నందమూరి బాలకృష్ణ గతంలో కూడా అనేక స్టేజీల మీద పాటలు పాడారు కానీ ఎక్కువగా ట్రోల్ అవుతూ వచ్చారు. కానీ ఈ శివశంకరి అనే పాట విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపోయి భలే పాడారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని డాక్టర్ ముఖర్జీ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దోహాలో తన స్నేహితుడు రికార్డు చేసిన ఈ వీడియోని తనకు పంపించారని ఇది చూసి తనకు చాలా ఆశ్చర్యం అనిపించిందని నందమూరి బాలకృష్ణ గురించి ఈ సందర్భంగా డాక్టర్ ముఖర్జీ కామెంట్లు చేశారు.
Also Read: Venu Swamy Comments: ఇక మిగిలింది శోభనం షూట్లే.. ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన కామెంట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook