Gun fires at Dallas: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ.. 8 మంది మృతి.. ఏడుగురికి గాయాలు..

US Shooting: అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. డల్లాస్ శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 01:59 PM IST
Gun fires at Dallas: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ.. 8 మంది మృతి.. ఏడుగురికి గాయాలు..

US Gun firing: యూఎస్ లో మరోసారి కాల్పులు కలకలం  రేగింది. డల్లాస్ నగరానికి ఉత్తరాన బిజీగా ఉన్న షాపింగ్ మాల్‌లోకి ఓ దుండగుడు చొరబడి ఎనిమిది మందిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. మరో నలుగురు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 5 నుంచి 61 సంవత్సరాల వయసు గల వ్యక్తులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నాం 3.40 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. 

అయితే పోలీసులు జరిపిన  కాల్పుల్లో దుండుగుడు కూడా మరణించాడు. మృతి చెందిన వారిలో పోలీసు అధికారి, సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. అయితే ఘటనా స్థలంలో మరొక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మాల్ లోకి దుండగుడు ఎంటర్ అయిన సమయంలో వందలాది మంది పౌరులున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనను మాటల్లో చెప్పలేని తీవ్ర విషాదంగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ పేర్కొన్నారు. మరోవైపు కాలిఫోర్నియాలో కూడా కాల్పుల ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

Also read: Press Freedom Index Rank: ఇండియాలో మీడియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News