SSMB 28 Problems: మహేష్-త్రివిక్రమ్ సినిమాకి కొత్త సమస్యలు.. అసలు సంగతి ఏంటంటే?

Mahesh Babu- Trivikram Film: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త సమస్య తెర మీదకు వచ్చిందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 7, 2023, 08:54 PM IST
SSMB 28 Problems: మహేష్-త్రివిక్రమ్ సినిమాకి కొత్త సమస్యలు.. అసలు సంగతి ఏంటంటే?

New Problems For Mahesh Babu 28 Film: మహేష్ బాబు హీరోగా ఆయన 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాని హారిక హాసిని సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చినబాబు, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఏదో ఒక అవాంతరంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోతూనే వస్తోంది.

ముందుగా మహేష్ తల్లి మరణించడం ఆ తర్వాత మహేష్ బాబు విదేశాలకు వెళ్లడం ఇలా వరుస కారణాలతో సినిమా షూటింగ్ హైదరాబాద్ వస్తోంది. నిజానికి ,మే నెలలో ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఏప్రిల్ మొదటి వారం తర్వాత ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దీంతో మహేష్ బాబు వెంటనే మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. కానీ ఈ సినిమాకి అనుకోని సమస్యలు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Rakshitha Suresh: రోడ్డు ప్రమాదానికి గురైన పాపులర్ సింగర్.. చచ్చి బతికానంటూ పోస్ట్

అదేమిటంటే మహేష్ బాబు అలాగే హీరోయిన్ పూజ హెగ్డే సినిమా షూటింగ్ కి హాజరయ్యేలా ఉన్నా మిగతా సినిమా నటీనటుల డేట్స్ సర్దుబాటు చేయడం తలనొప్పిగా మారిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది, అనేకమంది నటీనటులు సినిమాలో భాగమవుతున్నారు. చాలా మంది కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సినిమాలో నటిస్తున్నారు.

అయితే వాళ్లందరూ ఇతర సినిమాల్లో కూడా నటిస్తూ ఉండడంతో డేట్స్ క్లాష్ అవుతున్నాయని తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం అయితే సవ్యంగా జరిగిపోయేది కానీ సినిమా వాయిదా పడుతూ రావడంతో ఈ సమస్య మొదలైనట్టు చెబుతున్నారు. దానికి తోడు శ్రీ లీలను హీరోయిన్ గా ఎంచుకోవడంతో ఇప్పుడు ఆమెకు ఈ సినిమా కాకుండా మరో ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయని శ్రీ లీల కాంబినేషన్స్ సీన్లు షూట్ చేయడం కూడా కష్టం అయిపోయింది అని తెలుస్తోంది.

ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఎక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఆగస్టు నెలలో విడుదల చేయాలని ముందు భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతి వీడియో చేసే లో ఉన్నారు చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.    

Also Read: Kushi Movie Getups: ఖుషీలో అప్పుడు ముస్లింగా దేవరకొండ.. ఇప్పుడు సమంత.. ఇదేందయ్య ఇదీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x