4 Benefits of Drinking Aloe Vera Juice: కలబందలో అధిక పరిమాణంలో ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు కలబంద మిశ్రమాన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించేవారు శాస్త్రంలో పేర్కొన్నారు. కలబంద జుట్టు చర్మానికే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు A, C, E, ఫోలిక్ యాసిడ్, కోలిన్, B1, B2, B3, B6, విటమిన్ B12, కాల్షియం, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, పొటాషియంతో పాటు.. 60 రకాల పోషకాలు లభిస్తాయి.
కాబట్టి కలబంద మిశ్రమాన్ని ఏ వ్యాధులకు ఉపయోగించిన సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కలబంద మిశ్రమమే కాకుండా కలబంద జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చూసిన తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద రసం ప్రయోజనాలు:
అలోవెరా తో తయారుచేసిన జ్యూస్ మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కలబంద రసం ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషక విలువలు చర్మాన్ని మెరిపించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కలబందలో తక్కువ పరిమాణంలో కేలరీలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కూడా అలోవెరా రసం సహాయపడుతుంది.
అలోవెరా జ్యూస్ లో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేసేందుకు సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.