Wriddhiman Saha Pant: ప్యాంట్ తిర్రమర్ర వేసుకున్న వృద్దిమాన్ సాహా.. మైదానంలో నవ్వుకున్న ప్లేయర్స్! వైరల్ వీడియో

Wriddhiman Saha Wearing Pant Reverse in GT Vs LSG Match. గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ప్యాంట్ తిర్రమర్ర వేసుకుని మైదానంలోకి వచ్చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 8, 2023, 08:12 PM IST
Wriddhiman Saha Pant: ప్యాంట్ తిర్రమర్ర వేసుకున్న వృద్దిమాన్ సాహా.. మైదానంలో నవ్వుకున్న ప్లేయర్స్! వైరల్ వీడియో

Wriddhiman Saha Wearing Pant Reverse in GT Vs LSG Match: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. గుజరాత్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ప్యాంట్ తిర్రమర్ర వేసుకుని మైదానంలోకి వచ్చేశాడు. లక్నో ఛేజింగ్ సమయంలో మైదానంలోకి తొందరగా రావాలనే ఆతృతలో చూసుకోకుండా ప్యాంట్‌ను రివర్స్ వేసుకున్నాడు. సాహా ప్యాంట్ తిర్రమర్ర వేసుకోవడంతో.. ముందుకు ఉండాల్సిన బ్రాండ్ ప్రమోషన్స్ పేర్లు వెనుకాలకు వచ్చాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వృద్దిమాన్ సాహా ప్యాంట్ తిర్రమర్ర వేసుకుని మైదానంలోకి దూసుకొచ్చేశాడు. చేతికి గ్లోవ్స్ వేసుకుంటూ వడివడిగా నడుచుకుంటూ రాగా.. వెనకాల ఒకరు విషయం చెప్పారు. దాంతో తిరిగి చూసుకున్న సహా ఒక్కసారిగా నవ్వుకున్నాడు ఇక చేసేది లేక అలానే వికెట్ల వద్దకు వచ్చాడు. సాహా ప్యాంట్ గమనించిన గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నవ్వులు పూయించారు. పేసర్ మహమ్మద్ షమీ, బ్యాటర్ క్వింటన్ డికాక్ పగలబడి నవ్వుకున్నారు. కీపర్ కావడంతో బయటకు వెళ్లలేకపోయిన సాహా 2 ఓవర్ల తర్వాత మైదానం వీడి ప్యాంట్‌ను సరిచేసుకుని వచ్చాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై సాహా స్పందించి.. ప్యాంట్ తిర్రమర్ర వేసుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. 

మ్యాచ్ అనంతరం వృద్దిమాన్ సాహా మాట్లాడుతూ... 'మొదటి ఇనింగ్స్ తర్వాత ఫిజియో నా వద్దకు వచ్చి రెండో ఇన్నింగ్స్‌లో నీకు రెస్ట్ ఇస్తూన్నామని చెప్పాడు. దాంతో నేను భోజనం చేస్తున్నా. ఆ సాయంలో మరలా వచ్చి అంపైర్లు ఒప్పుకోలేదు, వికెట్ కీపింగ్ నువ్వే చేయాలని చెప్పారు. దాంతో సమయం అయిపోయిందనే తొందరలో ప్యాంట్ తికమక వేసుకున్నా. మైదానంలోకి వెళ్లగానే విషయం తెలిసింది. చేసేది లేక అలానే కంటిన్యూ అయ్యా. రెండు ఓవర్ల తర్వాత బయటకు వెళ్లి ప్యాంట్ మార్చుకున్నా. ఆ సమయంలో కేఎస్ భరత్ అద్భుతంగా కీపింగ్ చేశాడు' అని అన్నాడు. నిబంధనల ప్రకారం.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను అనుమతించాలంటే కనీసం రెండు ఓవర్లు ఫీల్డ్ చేయాలి. అయితే గాయం అయిన సందర్భంలో మాత్రం నేరుగా బరిలోకి దిగవచ్చు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా (81; 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ ( 94 నాటౌట్; 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు. లక్ష్య చేధనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడింది. క్వింటన్ డికాక్ (70; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (48; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించార్. మోహిత్ శర్మ (4/29) నాలుగు వికెట్లతో చెలరేగాడు. 

Also Read: TS Inter Results 2023 Live Updates: 2023 తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Also Read: Ishan Kishan WTC Final: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో స్టార్ ప్లేయర్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News