Rahu Transit 2023: త్వరలో రాహువు సంచారం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

Rahu Rashi Parivartan 2023: ఛాయా గ్రహమైన రాహువు త్వరలో మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. ప్రస్తుతం రాహువు మేషరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో రాహు సంచారం మూడు రాశులవారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 07:25 AM IST
Rahu Transit 2023: త్వరలో రాహువు సంచారం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

Rahu Gochar 2023:  ఆస్ట్రాలజీలో రాహువును ఛాయా గ్రహం, దుష్ట గ్రహం లేదా పాప గ్రహం అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. జాతకంలో రాహు దోషం ఉన్నవారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. అంతేకాకుండా వీరి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. రాహువు ఎప్పుడు చెడు ఫలితాలను కాదు, అప్పుడప్పుడు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ ఏడాది రాహువు తన రాశిని మార్చబోతున్నాడు. అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు రాహువు మేషరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాహువు యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం
రాహు సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ఈ సమయంలో సంయమనం పాటించాల్సి ఉంటుంది. 

మీనరాశి
రాహువు అక్టోబర్ లో మేషరాశి నుండి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు శుభవార్తలు వింటారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 

మేష రాశి
రాహు రాశి మార్పు మేషరాశి వారికి మేలు చేస్తుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగంలో పురోగతి పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 

Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 శుభ యోగాలు.. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News