Bhuvneshwar Kumar and Shubman Gill Creates All-Time Record in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమాన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించారు. ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీసిన మొదటి ప్రత్యర్థి జోడీగా భువనేశ్వర్, గిల్ నిలిచారు. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గిల్ (101; 58 బంతుల్లో 13×4, 1×6) సెంచరీ చేయగా.. భువనేశ్వర్ (5/30) ఐదు వికెట్స్ పడగొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇలాంటివి జరగడం ఇదే తొలిసారి. భువీ సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగగా.. గుజరాత్ తరఫున గిల్ ఆడుతున్నాడు.
ఆసక్తికరంగా పురుషుల టీ20 క్రికెట్‌లో ఇంతకుముందు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, ఐదు వికెట్లు తీయడం రెండుసార్లు మాత్రమే జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్ (111) సెంచరీ చేయగా, తమిళనాడు తరఫున వి అతిశయరాజ్ డేవిడ్‌సన్ (5/30) 5 వికెట్స్ సాధించాడు. 2021లో బెల్జియం మరియు ఆస్ట్రియా మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ గేమ్‌లో ఇలానే జరిగింది. బెల్జియంకు చెందిన సాబెర్ జఖిల్ (100 నాటౌట్) చేయగా.. ఆస్ట్రియాకు చెందిన అకిబ్ ఇక్బాల్ (5/5) ఐదు వికెట్స్ పడగొట్టాడు.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐదు వికెట్ల హాల్‌తో పాటు 25 ప్లస్ పరుగులు చేసిన రెండో బౌలర్‌గా భువీ రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో
భువనేశ్వర్ ఐదు వికెట్లు పడగొట్టడంతో పాటు 27 పరుగులు చేశాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్ర స్థానంలో ఉన్నాడు. డెక్కన్ ఛార్జర్స్‌పై జడేజా 48 పరుగులు చేయడమే కాకూండా ఐదు వికెట్లు పడగొట్టాడు.
గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో ఓ రనౌట్ కూడా ఉండడం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అధికారికంగా నిష్క్రమించింది.
Also Read: Tata Punch EV: త్వరలో విడుదల కానున్న టాటా పంచ్ ఈవీ.. సింగిల్ ఛార్జింగ్‌పై 300 కిమీల ప్రయాణం!
Also Read: MG Comet EV Bookings: ఎంజీ కామెట్ ఈవీ బుకింగ్స్ మొదలు.. మొదటి 5000 మందికి బంపర్ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Bhuvneshwar-Gill Record: ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన భువనేశ్వర్, గిల్!