Surya Mahadasha 2023: శని కాదు ఇక ఈసారి సూర్య మహాదశ, ఆరేళ్ల వరకూ ఎలా ఉంటుందంటే

Surya Mahadasha 2023: హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడికి ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలకు రారాజు కావడంతో సూర్యుడి ప్రతి కదలిక వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంది. మరి ఇంత ప్రత్యేకమైన సూర్యుడి మహాదశ గురించి చాలా మందికి తెలియదు. అదెలా ఉంటుంది, ఎన్నేళ్లుంటుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2023, 08:02 AM IST
Surya Mahadasha 2023: శని కాదు ఇక ఈసారి సూర్య మహాదశ, ఆరేళ్ల వరకూ ఎలా ఉంటుందంటే

Surya Mahadasha 2023: ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశించినట్టే సూర్యుడు ప్రతి నెలా వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటాడు. ప్రతి రాశి జాతకం కుండలిలో సూర్యుడి మహాదశ వేర్వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో సూర్యుడి మహాదశ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ప్రస్తుతం సూర్యుడు వృషభ రాశిలో ఉండటం వల్ల ఆ ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కన్పిస్తుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది.

జ్యోతిష్యం ప్రకారం వేర్వేరు జాతకుల కుండలిలో సూర్యుడి మహాదశ, అంతర్దశ రెండూ ఉంటుంటాయి. సూర్యుడి మహాదశ కొందరికి అద్భుతంగా కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ జాతకంవారికి శుభంగా ఉంటుందో ఆ జాతకులకు ఊహించని రీతిలో కనకవర్షం కురుస్తుంది. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. జీవితంలో ఏ విధమైన సమస్య తలెత్తదు. సూర్య మహాదశ అనేది 6 ఏళ్లు ఉండే ప్రక్రియ. అంతులేని ధన సంపద లభిస్తుంది. ప్రతి రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఇంత కీలకమైన సూర్య మహాదశ ప్రయోజనాలు పొందేందుకు జ్యోతిష్యం ప్రకారం కొన్ని ఉపాయాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

సూర్యుడి మహాదశ సందర్భంగా మీపై ప్రతికూల పరిస్థితి ఉంటే  ప్రతి ఆదివారం నాడు రాగి, గోధుమలు దానంగా ఇవ్వాలి. దీంతో పాటుగా సూర్యుడికి రాగి పాత్ర ద్వారా అక్షింతలు, జలం అభిషేకం చేయాలి. ఇలా చేస్తే సూర్య మహాదశ ప్రయోజనాలు ఆరేళ్లు పాటు నిరాటంకంగా కొనసాగుతాయి. నిర్ణీత పద్ధతిలో ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలంటారు. అంతేకాకుండా ఓం హ్రాం, హ్రీం, హ్రోం, సహ, సూర్యాయ నమహ, మంత్రాన్ని జపిస్తుండాలి. ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో నీళ్లు పోయాలి. సాయంత్రం రావిచెట్టు మొదలుకు ఆవాల నూనెతో దీపం వెలిగించి ప్రార్ధనలు చేయాలి.

సూర్యుడి శుభ స్థితి ఎలా ఉంటుంది

జ్యోతిష్యం ప్రకారం కుండలిలో సూర్యుడు పటిష్టమైన స్థితిలో ఉంటే మాత్రం ఆ రాశివారికి సూర్యుడి మహాదశ అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఆరేళ్లవరకూ ప్రతిరంగంలో తమదైన ముద్ర వేస్తారు. జీవితంలో ఉన్నత పదవులు పొందుతారు. ఊహించని డబ్బు వచ్చి పడుతుంది. ఆర్ధికంగా ఏ సమస్యా ఉండదు. కెరీర్‌పరంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అంటే మొత్తానికి అన్ని విధాలుగా లాభాలే కన్పిస్తాయి. 

సూర్యుడి అశుభ స్థితి  

హిందూ జ్యోతిష్యం ప్రకారం ఎవరి కుండిలో బలహీనంగా ఉందో ఆ జాతకులపై సూర్యుడి మహాదశ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్య మహాదశ నడిచే ఆరేళ్ల వరకూ ఈ జాతకులకు అంతా నష్టమే కలగనుంది. ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బంధుత్వాల్లో విబేధాలు తలెత్తుతాయి. ఈ సమయంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Sun transit 2023: జూన్ 14 వరకూ ఈ 4 రాశులకు మహర్దశే, వద్దంటే వచ్చి పడే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News