Hyderabad Traffic Alerts: నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ మార్గంలో వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

Hyderabad Traffic Alerts: ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా మీడియా సిబ్బందిని, GHMC అధికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అన్ని మార్గాలను వివరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2023, 09:31 PM IST
Hyderabad Traffic Alerts: నగరంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ మార్గంలో వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

Gachibowli Junction to Kondapur Flyover Construction Work: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు వెళ్లే రహదారిలో ఫ్లైఓవర్ పని జరుగుతున్నందున.. అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. జీహెచ్ఎంసీ శిల్పా లేఅవుట్ ఫేజ్-II ఫ్లై ఓవర్ పనిని గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు (90) రోజుల పాటు జరగనుంది. అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరగనుంది. ఈ నేపథ్యంలో కింది మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుంది. 

ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సూచించారు. ఈ సందర్బంగా ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులకు మీడియా ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా మీడియా సిబ్బందిని, GHMC అధికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అన్ని మార్గాలను వివరించారు.

గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులపై గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
1. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుండి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి  శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ - AIG హాస్పిటల్ - క్యూ మార్ట్ - కొత్తగూడ ఫ్లైఓవర్- హాఫీజ్‌పేట్ వెళ్లేవిధంగా ఏర్పాటు చేశారు.

2. లింగంపల్లి నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను గచ్చిబౌలి ట్రాఫిక్ PS - DLF రోడ్ - రాడిసన్ హోటల్ - కొత్తగూడ మీదుగా - కొండాపూర్ వద్ద డైవర్ట్ చేస్తున్నారు.

3. విప్రో జంక్షన్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ IIIT జంక్షన్ వద్ద డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎడమ మలుపు - గచ్చిబౌలి స్టేడియం వద్ద U టర్న్ - DLF రోడ్ - రాడిసన్ హోటల్ - కొత్తగూడ ఆల్విన్ కాలనీ X రోడ్డు వైపు వెళ్ళాలి.

4. టోలిచౌకి నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ - మైండ్స్పేస్ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తున్నారు. ఇక్కడ సైబర్ టవర్స్ జంక్షన్ - హైటెక్స్ సిగ్నల్ వైపు ఎడమవైపు - కొత్తగూడ జంక్షన్ ద్వారా వెళ్ళాలి.

5. టెలికాం నగర్ నుండి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి వద్ద ఫ్లై ఓవర్ కింద యూ-టర్న్ వద్ద మళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ పక్కన శిల్ప లే అవుట్ ఫ్లై ఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ - AIG హాస్పిటల్ - క్యూ మార్ట్ - కొత్తగూడ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి. 

6. ఆల్విన్ కాలనీ X రోడ్  నుండి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్ వద్ద దారి మళ్లిస్తున్నారు. హైటెక్స్ రోడ్డు వైపు - సైబర్ టవర్ - మైండ్స్పేస్ జంక్షన్. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - గచ్చిబౌలి / ORR ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. 

7. ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుండి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించడం జరుగుతుంది. - మసీదుబండ - హెచ్సియు డిపో – లింగంపల్లి ద్వారా వెళ్ళాలి. 

8. కూకట్‌పల్లి నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాల్సిన వారు సైబర్ టవర్స్ మీదుగా -యికేయ అండర్ పాస్ -బయో  డైవర్సిటీ రైట్ టర్న్ గచ్చిబౌలి మీదుగా వెళ్ళాలి. అలాగే రివర్స్ ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాల్సి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు.
 
9. T-hub రోడ్లను ఉపయోగించుకునే విధంగా కేబుల్ బ్రిడ్జ్ - కోహినూర్ హోటల్ - తంగేడు రెస్టారెంట్ - ఖాజాగూడా వైపునకు, అలాగే రివర్స్ ట్రాఫిక్ అదే మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. 

10. IKEA రోటరీ వద్ద మూడు U Turns లను C గేట్ వద్ద, NCC ముందు అలాగే IKEA స్టోర్ వద్ద  ఇచ్చామని.. అలాగే రోటరీ చిన్నది కావటం వలన ట్రాఫిక్ లాక్ కాకుండా ఏర్పాటు చేయటం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

11. Hitex  వద్ద U టర్న్ ఏర్పాటు చేసి Tech Mahindra, Lemon Tree Hotel మీదుగా ట్రాఫిక్ రెండు వైపులా మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా పాత్రికేయులతో పాటు GHMC మరియు అధికారులను బస్ ద్వారా పైన చెప్పిన  మార్గాల్లో తిప్పుుతూ అవగాహన కల్పించారు. ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే వారికి, ఐటి ఉద్యోగులకు తగిన అవగాహన కల్పించాల్సిందిగా ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు కూడా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా సహకరించాల్సిందిగా కోరారు.

Trending News