New York City Looming Threat: ఏదైనా నగరాల్లో న్యూయార్క్ సిటీ ఒకటి.. ఇక్కడ జనాభా 80 లక్షలకు పైగానే జీవిస్తూ ఉంటారు. కానీ 10 లక్షల దాకా భవనాలు ఉండడంతో ఏటా రెండు మీటర్లు చొప్పున న్యూయార్క్ నగరాన్ని సముద్రమట్టం మింగేస్తుంది. సముద్రతీరంలో ఉన్న ఈ నగరం ప్రతి సంవత్సరం రెండు మీటర్లకు పైగానే కుంగిపోతుందని తాజా అధ్యయనాల్లో వెళ్లడైంది. క్రమంగా సముద్రమట్టం పెరగడమే కాకుండా భవనాల సముదాయం ఏటా పెరగడం కారణంగా భూమిపై ఒత్తిడి పెరిగి ఈ ముంపునకు దారితీస్తుందని అడ్వాన్సింగ్ ఎర్త్, స్పేస్ సైన్స్ పత్రికలో పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పలు నివారణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ఐదు ఆరు సంవత్సరాల లోపు మరింత పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రతీరాల్లో ఉన్న ప్రధాన ఇలాంటి సమస్యల బారినై పడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇటీవల భారత్ లోని ఉత్తరకాండలో ఇలానే జరిగింది. భూమి అంతర్భాగంలో ఉత్తీర్ పెరగడం కారణంగా భూ పై భాగంలో కూలిపోయాయి. న్యూయార్క్ లో కూడా ఇలాంటి సంఘటనే జరగొచ్చు అని సైంటిస్టులు అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం ముందుగానే నిపుణులు సూచించిన సలహాలు సూచనలను పాటించడం చాలా మంచిది.
Also Read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో 80 లక్షల కంటే ఎక్కువ మంది జీవిస్తున్నారు. వీరంతా కలిసి 10 లక్షలు కంటే ఎక్కువగా ఉన్న ఆకాశాన్నంటే భారీ భవనాల్లో నివాసం ఉంటున్నారు. భారీ భవనాల కారణంగా కూడా ఏటా రెండు మిల్లీమీటర్ల చొప్పున సముద్రంలోకి భూమి తూర్పు పోతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇదే పరిస్థితి మరో 80 ఏళ్ల పాటు ఉంటే.. న్యూయార్క్ సిటీ మొత్తం 1500 మిల్లీ మీటర్లకు పైగా కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంవత్సరం న్యూయార్క్ నగరం పై ప్రకృతి విలయతాండవం చేస్తుంది 2012లో ఏర్పడిన శాండీ తుఫాను కారణంగా సముద్రమట్టం నగరంలోకి మరింత చొచ్చుకొని వచ్చింది. ఇక 2021 లో సంభవించిన తుఫాను కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో పలు సమస్యలు తలెత్తాయి. మితిమీరిన ప్రపంచీకరణం కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికైనా పలు జాగ్రత్తలు తీసుకొని మార్పు చేర్పులు చేయడం కారణంగా న్యూయార్క్ ను ముంపు బారిన నుంచి తప్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook