Belly Fat Tips: 30 రోజుల్లో బెల్లీ ప్యాట్ పోవాలంటే..రోజూ ఇలా చేయాల్సిందే

Belly Fat Tips: ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా బెల్లీ ఫ్యాట్ లేదా స్థూలకాయం పెద్ద సమస్యగా కన్పిస్తోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఇలా ఈ సమస్యకు కారణాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఉందా లేదా..ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2023, 07:30 PM IST
Belly Fat Tips: 30 రోజుల్లో బెల్లీ ప్యాట్ పోవాలంటే..రోజూ ఇలా చేయాల్సిందే

Belly Fat Tips: స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్, అధిక బరువు. ఆధునిక జీవన ప్రపంచంలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్యలివి. ఫిట్ అండ్ స్లిమ్‌గా కన్పించకపోవడంతో నలుగురిలో అసౌకర్యంగా, అవమానకరంగా కూడా ఉండే పరిస్థితులుంటాయి. ఈ సమస్యకు కారణం ఒక్కటే లైఫ్‌స్టైల్. లైఫ్ మార్చుకుంటే అంతా పరిష్కారమైపోతుంది. 

చాలామందికి పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటుంది. దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇంకొందరికి స్థూలకాయం కారణంగా ఈ సమస్య ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ దూరం చేసేందుకు డైట్ పరంగా, వ్యాయామ పరంగా చాలా ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం కేవలం నెలరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. పొట్ట, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును వేగంగా కరిగించవచ్చు.

పొట్ట చుట్టూ లేదా నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి చర్మం వదులై నలుగురిలో చాలా చికాకుగా ఉంటుంది. స్థూలకాయం కారణంగా చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ సమస్యల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. తిండి మానేయాల్సిన పని లేదు. కేవలం కొన్ని సులభమైన చిట్కాలతోనే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

పొట్ట చుట్టూ ఉండే కొవ్వు చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. మీ పొట్ట చుట్టూ, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వునే బెల్లీ ఫ్యాట్ అంటారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తవచ్చు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే రోజూ ఒక గంట సేపు డ్యాన్స్ చేస్తే చాలంటున్నారు న్యూట్రిషియన్లు. ఎందుకంటే డ్యాన్స్ అనేది మొత్తం శరీరానికి వ్యాయామం చేయించేస్తుంది. కొద్దిరోజుల వ్యవధిలోనే బెల్లీ ఫ్యాట్ తొలగిపోతుంది. 

రోజూ సైక్లింగ్

సైక్లింగ్ కూడా చాలా మంచి వ్యాయామం. జిమ్ కు వెళ్లకుండానే బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే సైక్లింగ్ మంచి ప్రత్యామ్నాయం. రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా త్వరగా పోతుంది. కొన్నిరోజుల్లోనే వెన్న కరిగినట్టుగా కరిగిపోతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళ ఎప్పుడైనా సైక్లింగ్ చేయవచ్చు.

క్యాట్ వాక్

రోజూ క్యాట్ వాక్ తరహాలో ఓ అరగంట వాకింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ చాలా వేగంగా కరిగిపోతుంది. చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ క్యాట్ వాక్ చేస్తే అలుపు ఉండదు. కొవ్వు కరగడం ప్రారంభమౌతుంది. 

Also read: Anti Ageing Tips: ఇంట్లో తయారు చేసే ఈ ఫేస్‌ప్యాక్ రాస్తే చాలు..వయస్సు యాభై దాటినా యౌవనమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News