LIVE UPDATES- Odisha Train Accident: 288 మందికి చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం

Update on Coromandel Express Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి వెళ్తుండగా బహనగ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పి అవతలి రైలు పట్టాలపైకి వెళ్లింది. దురదృష్టవశాత్తుగా అదే సమయంలో యశ్వంతపూర్ నుంచి కోల్ కతా వెళ్తున్న రైలు కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొనడం మరో ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు.

Written by - Pavan | Last Updated : Jun 3, 2023, 10:59 AM IST
LIVE UPDATES- Odisha Train Accident: 288 మందికి చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం

288 People are dead in Coromandel Express Train Accident till now: ఒడిషా రైలు ప్రమాదం భారతీయులను అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒడిషాలోని బాలాసూర్ జిల్లా బహనగ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘోర రైలు ప్రమాదంలో 50 మంది వరకు మృత్యువాత పడినట్టుగా రైల్వే అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారి సంఖ్య 350కి పైనే ఉంటుంది అని రైల్వే శాఖ అంచనా వేసింది. వందల సంఖ్యలో ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోవడంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

ఈ దుర్ఘటనపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణన్.. రైలు ప్రమాదం ఘటనా స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఘటనాస్థలానికి బయల్దేరారు. ఇంకొద్దిసేపట్లో కేంద్రమంత్రి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు.

రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాలాసోర్ మెడికల్ కాలేజీతో పాటు సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరోవైపు సమీపంలోని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నుంచి కొంతమంది వైద్యుల బృందాలను అత్యవసర వైద్య సహాయం కోసం ఘటనా స్థలానికి రప్పించారు. 

Also Read: Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదం, దశాబ్దకాలంలో అతిపెద్ద ప్రమాదమిదే

ప్రయాణికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఈ దుర్ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు రైల్వే శాఖ ఖరగ్‌పూర్, కోల్‌కతా, బాలాసూర్, చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. 

ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతులు కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడానని.. ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలు నిరాటంకంగా జరగుతున్నాయని అన్నారు. కేంద్రం వైపు నుంచి అన్నిరకాల సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్వీట్ లో స్పష్టంచేశారు.

Also Read: Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News