Chicken Rates in Year 2001: ప్రపంచంలో ఆహారానికి కొరత ఉంది కానీ ఆహార ప్రియులకు ఎలాంటి కొరత లేదు. అందుకే కాలక్రమంలో ఆహార పదార్థాల ధరలు ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. ధరలు పెరుగుతున్నాయని భోజన ప్రియులు, జనం భోజనం చేయడం మానేయరు కదా. అందుకే రెస్టారెంట్లలో కస్టమర్లకి కూడా కొదువ లేదు. ఒకప్పటితో పోల్చుకుంటే రెస్టారెంట్ లో మెనూ కార్డులో ధరల పట్టిక చూస్తే ఇప్పుడు గుండె గుబేల్ మనేలా ఉంటోంది కదూ.. పెద్ద వారిని టచ్ చేస్తే.. మా కాలంలో అయితే భోజనం చేసినా, ఇంకేమైనా సరదాగా స్నాక్స్ తిన్నా.. అతి తక్కువలోనే అయిపోయేది అని చెబుతుంటారు కదా.. అప్పుడు వారి మాటలు వింటే నమ్మశక్యం కావడం లేదు అని అనిపిస్తుంది కదా.. అయితే, ఇదిగో వారు చెప్పే ఆ మాటలు నిజమే అనడానికి సాక్ష్యం ఇదిగో.
తాజాగా సోషల్ మీడియాలో ఒక పాత మెనూ కార్డు వైరల్ అవుతోంది. అందులో రాసున్న ఆహార పదార్థాల ధరలు చూస్తే మీరు షాక్ అవుతారు. ఎస్పెషల్లీ నాన్ వెజ్ మెనూ ఐటమ్స్ ధరలు చూస్తే మరీ షాక్ అవుతారు. ఇప్పటికంటే ఆ రోజులే బాగున్నాయే అని కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఆ మెనూ కార్డు ఎప్పటిది, అందులో ఏం రాసి ఉందో చూద్దాం రండి.
మెనూ కార్డులో ఆహార పదార్థాల ధరలు ఎలా ఉన్నాయంటే..
2001 సంవత్సరం నాటి ఈ మెనూ కార్డులో ఎగ్ రోల్ రూ.7, చికెన్ రోల్ రూ.10, ఎగ్ చికెన్ రోల్ రూ.15, ఎగ్ మటన్ రోల్ రూ.16లకు లభించనున్నట్టుగా పేర్కొని ఉంది. అంతేకాదు.. అన్నింటికి మించి కస్టమర్స్ లొట్టలేసుకుని తినే చికెన్ బిర్యానీ కేవలం అంటే కేవలం రూ.30కే లభించేది. చికెన్ చాప్ రూ.25, చికెన్ దోప్యాజా రూ.30, చికెన్ ముసల్లం రూ.85, చికెన్ టిక్కా రూ.45 లకు మాత్రమే లభించేది అంటే నమ్ముతారా ? నమ్మకపోతే ఈ మెనూ కార్డునే మరోసారి పరిశీలించండి.
ఇది కూడా చదవండి : IRCTC Tour Package: కేవలం 16 వేలకే ఎన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చో !!
ఇప్పటివరకు మీరు ఎక్కువగా చూసింది కేవలం చికెన్ తో తయారు చేసిన ఐటమ్స్ మాత్రమే.. ఒకవేళ మీరు కానీ మటన్ బిర్యానీ రేటు చూశారో.. మీరు మరోసారి షాక్ అవుతారు. 2001 లో కేవలం రూ.32కే మటన్ బిర్యానీ లభించేది. మటన్ మొఘలాయి రూ.30, మటన్ హండీ రూ.50, మటన్ చాప్ రూ.25, మటన్ దోప్యాజా కేవలం రూ.32కే లభించేవి. ఫిష్ ఫుడ్ లవర్స్ కి కూడా అప్పట్లో తక్కువ ధరలోనే నచ్చిన ఆహార పదార్థాలు లభించేవి అని ఈ మెనూ కార్డు చూస్తే అర్థం అవుతోంది. రూ.10 లకే ఫిష్ ఫ్రై, ఫిష్ కట్లెట్ రూ.10, రూ.16 లకే ఫిష్ ఫింగర్, రూ.25 ఫిష్ తందూరి లభించును అని మెనూకార్డులో రాసి ఉంది. ఇక రోటీల గురించి మాట్లాడితే, రుమాలి రోటీ ధర కేవలం రూ.1.25, లచ్చ పరాటా ధర రూ.5 కి లభించేవి. అప్పడు ఉన్న ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు కనీసం నాలుగైదు రెట్లు పెరిగాయి. ప్రముఖ ఉర్దూ కవి, సాహితీవేత్త, గేయ రచయిత గుల్జార్ ఈ పాత మెనూ కార్డును తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Using Earphones ? : ఈయర్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారా ? ఐతే ఈ డేంజర్ గురించి తెలుసా ?
ఇది కూడా చదవండి : Live Accident Video: అచ్చం ఫాస్ట్ & ఫ్యూరియస్ లో లాగానే.. చూస్తుండగానే రయ్యుమని గాల్లోకి ఎగిరిన కారు.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : 2K Notes Viral Video: ఇలాంటి పిగ్గీ బ్యాంకుని మీరు ఎప్పుడైనా చూశారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK