Benefits of Betel leaves: తమలపాకు తినడం లేదా నమలడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Betel leaves benefits: వేసవిలో తమలపాకులు చాలా మేలు చేస్తాయి. వీటిని నమలడం లేదా రసం తాగడం వల్ల ఎన్నో రకాల ఇట్టే దూరమవుతాయి. తమలపాకులు వల్ల కలిగే ఉపయోగాలేంటో ఓసారి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 12:21 PM IST
Benefits of Betel leaves: తమలపాకు తినడం లేదా నమలడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Health benefits of paan or betel leaves in summer: భారతీయ సంస్కృతిలో తమలపాకు లేదా పాన్ ఆకులు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆకులకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్ మరియు కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ మెుత్తంలో కొవ్వులు ఉంటాయి. ఈ తమలపాకులు ఎన్నో రకాల వ్యాధులు మరియు రుగ్మతల చికిత్సలో సహాయపడతాయి.  తమలపాకులు నమలడం లేదా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

తమలపాకులు ప్రయోజనాలు
** తమలపాకులు నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాన్ ఆకుల పేస్ట్‌ను గాయాలపై రాస్తే వెంటనే పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల రసం తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
** మన దేశంలో చాలా మంది భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు. దీనిని నమలడం వల్ల మీ జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయి. 
పాన్ ఆకులు నమలడం వల్ల మీ నోటి దుర్వాసన దూరమవుతుంది. అంతేకాకుండా కావిటీస్, దంతక్షయాన్ని అరికట్టి నోటిని ఆరోగ్య్ంగా ఉంచుతుంది. 

Also Read: Litchi Face Mask: డ్రై స్కిన్‌, పిగ్మెంటేషన్ సమస్యలతో బాధపడుతున్నారా? లిచీ ఫేస్ ప్యాక్‌తో సర్వం మాయం!

** బరువు తగ్గడంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మీ శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. 
** పాన్ ఆకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రొలిఫెరేటివ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి.
** రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
** తమలపాకులు నమలడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. అంతేకకాుడండా మీరు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు.

Also Read: Best Summer foods: ఎండా కాలంలో మీ బాడీని వెంటనే కూల్ చేసే పదార్ధాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News