Shani Vakri 2023: అరుదైన యోగం చేస్తున్న తిరోగమన శని... ఈ 5 రాశులవారిపై నోట్ల వర్షం...

Saturn Retrograde 2023: ఈ నెలలో శనిదేవుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. మూడు దశాబ్దాల తర్వాత శని తన సొంత రాశిలో సంచరిస్తుంది. దీని కారణంగా మూల త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2023, 09:37 AM IST
Shani Vakri 2023: అరుదైన యోగం చేస్తున్న తిరోగమన శని... ఈ 5 రాశులవారిపై నోట్ల వర్షం...

Shani Vakri 2023 effect: మరో వారం రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. 30 ఏళ్ల  తర్వాత తన సొంత రాశిలో వ్యతిరేక దిశలో కదలనున్నాడు. శని రివర్స్ కదలిక వల్ల మూల త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఏ రాశులవారికి శని తిరోగమనం మరియు త్రికోణ రాజయోగం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

మేషం: శని తిరోగమనం వల్ల మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ధనం పెరుగుతుంది. కొత్త వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 
వృషభం: కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. 
మిథునం: తిరోగమన శని మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కుటుంబంలో మంచి సమయం గడుపుతారు. మీరు విదేశాలకు అవకాశం ఉంది. 

Also Read: Rahu Transit 2023: మీనరాశిలో సంచరించబోతున్న రాహువు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..

సింహ రాశి: మూల త్రికోణ రాజయోగం సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. 
మకరం: ఈ రాశికి శనిదేవుడు అధిపతి. శని తిరోగమనం మకరరాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. 

Also Read:  Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News