Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో భారీ డివిడెండ్ రాబడి ఇచ్చే షేర్స్

Stock Market Updates: స్టాక్ మార్కెట్లో ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అందులో ఒకటి షేర్ వ్యాల్యూ పెరగడంతో వచ్చే ఆదాయం ఒకటైతే.. రెండోది డివిడెండ్ రూపంలో లభించేది. లాభాల బాటలో ప్రయాణించే షేర్స్ నుంచి డివిడెండ్ ఇన్‌కమ్ కూడా అంతే స్థిరంగా ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2023, 04:14 PM IST
Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో భారీ డివిడెండ్ రాబడి ఇచ్చే షేర్స్

Stock Market Updates: స్టాక్ మార్కెట్లో ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అందులో ఒకటి షేర్ వ్యాల్యూ పెరగడంతో వచ్చే ఆదాయం ఒకటైతే.. రెండోది డివిడెండ్ రూపంలో లభించేది. లాభాల బాటలో ప్రయాణించే షేర్స్ నుంచి డివిడెండ్ ఇన్‌కమ్ కూడా అంతే స్థిరంగా ఉంటుంది. అందుకే చాలామంది డివిడెండ్ ఇన్‌కమ్ అధికంగా అందించే షేర్స్‌పైనే కన్నేసిపెడుతుంటారు. ఇదిగో ఈ నాలుగు రకాల షేర్స్ కూడా ఆ జాబితాలోనివే. ఈ 4 స్టాక్స్ లో డివిడెండ్ నుండి సంపాదించడానికి నేడే చివరి అవకాశం. 2125% వరకు లాభం ఉంటుంది; వివరాలను గమనించండి

నిన్న ఒక్క రోజు తప్పించి అంతకు ముందు మూడు రోజులు వరుసగా షేర్ మార్కెట్ లాభాల బాటలో ప్రయాణించింది. ఇక ఈ 4 షేర్ల నుంచి డివిడెండ్ ఇన్‌కమ్ కోసం ఈరోజు ఎక్స్-డేట్. ఈ స్టాక్స్‌లో ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి ఎఎంసి, వోల్టాస్, ఇండియన్ హోటల్స్ షేర్లు ఉన్నాయి.

ఏషియన్ పెయింట్స్ డివిడెండ్:
ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఏషియన్ పెయింట్స్ డివిడెండ్ రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన కంపెనీ ప్రతి షేరుకు రూ. 21.25 డివిడెండ్‌ను ఆమోదించింది. ఇందుకు గడువు జూన్ 9 గా ఉంది.

హెచ్‌డీఫ్‌సి ఏఎంసీ బ్యాంక్:
హెచ్‌డిఎఫ్‌సి ఎఎంసి డివిడెండ్‌లో 5 రూపాయలు షేర్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుకు 48 డివిడెండ్‌ను ఆమోదించినట్టు కంపెనీ ప్రకటించింది.

వోల్టాస్ డివిడెండ్:
వోల్టాస్ డివిడెండ్: ఏసీ మేకింగ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్స్‌లో ఒకటైన వోల్టాస్ కంపెనీ 425 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొన్న వివరాల ప్రకారం, 1 రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన షేర్ పై రూ. 4.25 ఫైనల్ డివిడెండ్ అందించనుంది.

ఇండియన్ హోటల్ డివిడెండ్: 
హోటల్ ఇండస్ట్రీలో 100 శాతం డివిడెండ్ ఇస్తున్న కంపెనీ ఇండియన్ హోటల్ కంపెనీ. ఇన్వెస్టర్స్ రూ. 1 ఫేస్ వ్యాల్యూపై ప్రతి షేరుకు రూ. 1 డివిడెండ్ లభించనుంది.

Trending News