Suresh Raina: లంక ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా.. బేస్ ధర ఎంతంటే..?

Suresh Raina In LPL 2023: లంక ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా అరంగేట్రం చేయనున్నాడు. ఎల్‌పీఎల్ 2023 వేలం కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. 50 వేల డాలర్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 13, 2023, 10:54 AM IST
Suresh Raina: లంక ప్రీమియర్ లీగ్‌లో సురేష్ రైనా.. బేస్ ధర ఎంతంటే..?

Suresh Raina In LPL 2023: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా విదేశీ లీగ్స్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన రైనా.. గతేడాది జరిగిని మినీ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో డగౌట్‌ నుంచే రైనా మ్యాచ్‌లను వీక్షించాడు. మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఎల్‌పీఎల్‌లో తన పేరు ఎంట్రీని నమోదు చేసుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్లు ఆడనున్నాయి. వేలంలో పాల్గొనే అంతర్జాతీయ, దేశీయ క్రికెటర్ల జాబితాను శ్రీలంక క్రికెట్ సోమవారం విడుదల చేసింది. 

ఈ లిస్టులో సురేష్ రైనా పేరు కూడా ఉంది. బేస్ ధర 50 వేల డాలర్లతో రైనా తన పేరును ఎంట్రీ చేసుకున్నాడు. ఐపీఎల్‌ తరహాలో ఎల్‌పీఎల్‌లో తొలిసారి వేలం నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో ఆడేందుకు మొత్తం 140 మంది అంతర్జాతీయ ప్లేయర్లతో సహా మొత్తం 500 మందికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.  టోర్నమెంట్‌లో పాల్గొనే ఐదు జట్లు కూడా ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు 500,000 యూఎస్ డాలర్లను ఖర్చు చేయవచ్చు.  

గతేడాది సెప్టెంబర్‌లో రైనా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు గుజరాత్ లయన్స్‌ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 205 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. దేశవాళీ టోర్నీల్లో ఉత్తరప్రదేశ్‌ తరపున ఆడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక టీమిండియా ప్లేయర్ విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే.. దేశవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవ్వాలి. ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలోనే 36 ఏళ్ల సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

టెస్టు క్రికెట్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా.. 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 226 వన్డేలు ఆడిన రైనా.. 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో సహా 5615 రన్స్ చేశాడు. వన్డేల్లో రైనా అత్యుత్తమ స్కోరు 116 నాటౌట్. 78 టీ20 మ్యాచ్‌ల్లో 134.79 స్ట్రైక్ రేట్‌తో 1604 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు బాదాడు. బౌలింగ్‌లో కూడా రైనా జట్టుకు సాయపడ్డాడు. టెస్టుల్లో 13 వికెట్లు, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  

Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News