AP Early Elections: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తూనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను, అధికార పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలొస్తాయని చెబుతూనే తనను కావాలని ఓడించారంటూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరడ్డుకుంటారో చూస్తానని సవాలు విసిరారు.
అన్నవరంలో సత్యదేవుని పూజల అనంతరం వారాహి యాత్రను ప్రారంభించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో మాట్లాడారు. భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు దీటైన పార్టీ జనసేన మాత్రమేనన్నారు. తనను అడ్డుకునేందుకు సినిమాలు కూడా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటూ కక్ష గట్టి ఓడించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. భీమవరం, గాజువాకలో ఓడించి తనను అడ్జుకున్నారని, ఈసారి తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవరడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమౌతున్నాయి. పాలించే వ్యక్తి తన కంటే నీతిపరుడై ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. పాలించే నాయకులకు బానిసలం కాదని, అక్రమంగా వేలకోట్లు కూడబెట్టినవారితోనే గొడవ అని చెప్పారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. తన బిడ్డల కోసం దాచిన డబ్బులతో జనసేన పార్టీ కార్యాలయం కట్టించానన్నారు.
ఈసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు తద్యమని..నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలకు జగన్ రెడ్డి సిద్ధమయ్యారని ఇప్పటికే ఈసీతో కూడా చర్చలు జరుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైకి మాత్రం ముందస్తు లేదంటూ జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పరస్పరం మన మధ్య గొడవలు పెట్టేందుకు ఎస్సీలు, బీసీలతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసేటప్పుడు కులాలవారీగా విడిపోవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు.
Also read: Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో అపశృతి, ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి వ్యక్తి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Early Elections: నవంబర్, డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయం, వారాహి యాత్రలో పవన్