Samajavaragamana: దూసుకుపోతున్న ‘సామజవరగమన’... రెండో వారం కూడా శ్రీవిష్ణుదే..!

Samajavaragamana collections: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిసోతంది. రెండో వారం కూడా ఎక్కడా తగ్గకుండా తన జోరును కొనసాగిస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2023, 05:44 PM IST
Samajavaragamana: దూసుకుపోతున్న  ‘సామజవరగమన’...  రెండో వారం కూడా శ్రీవిష్ణుదే..!

Samajavaragamana Box office collections: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండో వారంలోనూ శ్రీవిష్ణు తన జోరు కొనసాగిస్తున్నాడు. జూన్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్‍ తోనే ఈ సినిమాకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ చిత్రంపై అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు ప్రశంసల జల్లు కురిపించారు. ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.30.1 కోట్లు సాధించిన ఈ సినిమా అదే హోరును కొనసాగిస్తూ దుసుకుపోతుంది. రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. అమెరికాలోనూ ఈ చిత్రం మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది.  హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. 

సామజవరగమన సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా... ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై రాజేశ్ దండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు. శ్రీవిష్ణు సరసన మొనికా రెబ్బా జాన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, సుదర్శన,  దేవీప్రసాద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఓపెనింగ్స్ నామమాత్రంగానే ఉన్నా.. మౌత్ టాక్‍తో ఆ తర్వాతి నుంచి ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ అడియెన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో రిపీట్ గా జనాలు థియేటర్లకు వస్తున్నారు. 

శుక్రవారం నాగశౌర్య 'రంగబలి', శ్రీ సింహా 'భాగ్ సాలే', జగపతిబాబు రుద్రాంగి, 7:11 PM, సర్కిల్ వంటి రిలీజ్ అయ్యాయి. ఇందులో రంగబలి సినిమాకు మాత్రమే మిశ్రమ స్పందన వచ్చింది. మిగతావన్నీ బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సామజవరగమన రెండో వారం కూడా తన రోజును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీతో పాటే రిలీజైన నిఖిల్ స్పై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

Also Read: Prabhas in Vishnu Avatar: ఇదేం ట్విస్ట్ భయ్యా.. 'శ్రీమహా విష్ణు' అవతారంలో ప్రభాస్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News