Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది ప్రవాహం

Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. యుమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తోంది. రానున్న రెండ్రోజులు వరద మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2023, 06:29 PM IST
Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు, ప్రమాదస్థాయికి చేరుకున్న యమునా నది ప్రవాహం

Delhi Floods Alert: దేశ రాజదాని నగరం ఢిల్లీలో రెండ్రోజుల్నించి భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి ఉండటంతో ఢిల్లీకు వరద ముప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. యమునా నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాదిన తీవ్రంగా కన్పిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, జమ్మ కశ్మీర్‌లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండ్రోజుల్నించి విరామం లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్న ఒక్కరోజులో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఢిల్లీలో. ఇది 41 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఈ నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. 

యమునా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ మద్యాహ్నం నాటికి ఢిల్లీలోని పాత వంతెన వద్ద యుమునా నది నీటిమట్టం 204.63 మీటర్లకు చేరుకాగా, రేపటికి 205.5 మీటర్లకు చేరవచ్చని అంచనా. ఇప్పటికే సహాయక చర్యల కోసం 16 కంట్రోల్ రూమ్‌లు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, బోట్లు సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతుండటంతో యమునా నది నీటిమట్టం మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరికొకరు నిందించుకునే సమయం కాదని. అందరూ కలిసి ప్రజలకు సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. 

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఇప్పటికే జనజీవనం స్థంభించిపోయింది. రోడ్లు జలమయమై తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. యమునా నదిలో వరద ప్రవాహం పెరిగితే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. డిల్లీ పొరుగు రాష్ట్రం హర్యానాలోని ఇంద్రిలో కొన్ని గ్రామాల్లో యమున వరద నీరు ఇప్పటికే ప్రవేశించింది. 

Also read: Scary Videos: భయానక వీడియోలు.. భారీ వర్షానికి అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News