Tomato Vehicle Robbery: దేశంలో టమాటాల ధర చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.200 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొందరు టమాటాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. 2,000 కిలోల టమోటాలను మార్కెట్‌కు తరలిస్తున్న ఓ వాహనాన్ని ముగ్గురు దుండగలు హైజాక్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిక్కజాల సమీపంలోని ఆర్‌ఎంసీ యార్డు పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలై 8న చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే...
ఓ రైతు తన టమాటాలను బోలెరో వాహనంలో చిత్రదుర్గలోని హిరియూరు పట్టణం నుంచి కోలార్ మార్కెట్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తూ పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టంది బోలెరో. దీంతో కారులో ఉన్న ముగ్గురు దుండగులు బోలెరో డ్రైవర్, రైతుతో గొడవపడి నష్టపరిహారం డిమాండ్ చేశారు. వారి వద్ద నగదు లేదని చెప్పడంతో గొడవ మరింత ముదిరింది. దీంతో ఆగ్రహించిన ఆ దుండగలు రైతు, డ్రైవర్ ను రోడ్డుపై వదిలేసి టమాటాల వాహనంతో పరారయ్యారు.
ఆ టమాటాల ఖరీదు సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌ఎంసి యార్డ్ పోలీసులు అగంతకుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. కర్ణాటకలో టమాట ధర కిలో రూ.120 నుంచి రూ.150కి చేరింది. త్వరితగతిన సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పొలాల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతుండటంతో రైతులు టమాటా పంటకు కాపలాగా టెంట్లు వేసి మరి కాపలా కాస్తున్నారు.
Also Read: Landslides Falling on Roads : కార్లు వెళ్తున్న రోడ్డుపై కుప్పకూలిన కొండచరియలు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook