Heart Attack Problems: గుండెపోటుకు సంబంధించి ఓ అధ్యయనంలో ఆసక్తి కల్గించే అంశాలు వెలుగుచూశాయి. గుండెపోటు అనేది పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆ ముప్పు ఎక్కువనేది ఆ అధ్యయనం సారాంశం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుండెపోటు మరణాలు మహిళల్లోనే ఎక్కువంట.
గుండెపోటు అనగానే పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందనే అభిప్రాయం చాలామందిలో చాలాకాలంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. మహిళల్లోనే గుండెపోటు సమస్య ఎక్కువగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు. మహిళలు సాధారణంగా గుండెపోటు లక్షణాలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం ప్రదర్సిస్తుంటారు. అంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తక్కువ. ఫలితంగా చికిత్స ఆలస్యమై పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన హార్ట్ ఫెయిల్యూర్ 2023 అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు కారణంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇరువురికీ ఒకే సమయంలో చికిత్స అందించినా పురుషులతో పోలిస్తే మహిళలు బతికే అవకాశాలు తక్కువ. గుండెపోటు అనేది కేవలం పురుషుల్లోనే ఉంటుందనేది ఓ తప్పుడు అభిప్రాయమని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి గుండెపోటు మహిళలు, పురుషులు ఇద్దరినీ వెంటాడుుతుంటుంది.
మహిళల్లో కన్పించే లక్షణాలు
పురుషులతో పోలిస్తే గుండెపోటు వచ్చినప్పుడు మహిళల్లో విభిన్న రకాల లక్షణాలు కన్పిస్తాయని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. గుండెపోటు వచ్చినప్పుడు పురుషుల్లో ఎక్కువగా క్లాసిక్ లక్షణాలు కన్పిస్తాయి. అంటే ఛాతీలో నొప్పి లేదా అలజడి,ఉంటుంది. మహిళల్లో మాత్రం అసాధారణ లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాంటింగ్ సెన్సేషన్, జబ్బల్లో నొప్పి ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎప్పుడూ గుండెపోటుతో సంబంధం కలిగి ఉండవు. బహుశా అందుకే మహిళలు చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. ఫలితంగా వ్యాధి సీరియస్ అవుతుంటుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రస్తావన వచ్చినప్పుడు మహిళలు, పురుషుల శారీరక, హార్మోన్ మార్పుల్ని గుర్తించడం, వివిధ రకాల ముప్పులను అర్దం చేసుకోవడం అవసరం.
అమెరికాకు చెందిన హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మొదటిసారి గుండెపోటు వచ్చిన తరువాత ఐదేళ్లలో హార్ట్ ఫెయిల్ లేదా మరణం పాలయ్యే పరిస్థితి పురుషులతో పోలిస్తే 20 శాతం అధికం. గుండెపోటు వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువ వయస్సులోనే పరిస్థితి విషమించే ప్రమాదముంది.
సాధారణంగా మెనోపాజ్ తరువాత గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్రోజన్ ప్రభావం తక్కువైనప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఈస్ట్రోజన్ గుండెపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన రక్త నాళికలను పెంచడం, స్వెల్లింగ్ తగ్గించడం ఉంటుంది.
Also read: Ajwain Remedies: శరీరంలో అన్ని సమస్యలకు కారణం అదేనా, వాము నీటితో ఆ సమస్యకు చెక్ చెప్పేయవచ్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook