Pineapple Juice For Weight Loss In 10 Days: పైనాపిల్ జ్యూస్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కమ్మని రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇది నోటికి రుచిని అందించడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గాలనుకునే వారికి ప్రభావంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి లోపం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పైనాపిల్ జ్యూస్ ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుంది. ఈ జ్యూస్ ని బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట అల్పాహారానికి ముందు తీసుకుంటే రెండు వారాల్లోనే మంచి ఫలితాలు పొందుతారు.
పైనాపిల్ లో ఉండే పోషకాలు బరువుతో పాటు బెల్లీ ఫ్యాట్ ను కూడా సులభంగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ఈ పండులో కేవలం 55 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కాబట్టి ఉదయాన్నే పైనాపిల్ ని కూరగాయల సలాడ్స్ లో మిక్స్ చేసుకొని తినొచ్చు. ఇలా ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు పైనాపిల్ తో తయారు చేసిన జ్యూస్ ని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తీసుకోవడం కారణంగా చిన్న వయసులోనే మలబద్దకం గ్యాస్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పైనాపిల్ జ్యూస్ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పైనాపిల్ రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం కూడా యాక్టివ్ గా తయారవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఇలా చేయండి:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వ్యాయామాలు చేసిన తర్వాత మాత్రమే పైనాపిల్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది జ్యూస్ అనగానే అతిగా చక్కెరను వినియోగించి తయారు చేసిన వాటిని తాగుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు తప్పకుండా పైనాపిల్ జ్యూస్ తాగే క్రమంలో చక్కెర లేని రసాన్ని మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే మంచి ఫలితాలు పొందుతారని వారు చెబుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి