Chaturgrahi Yoga 2023: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. కొన్ని సార్లు పలు గ్రహాలు ఒక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. దీని కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నెలలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలోకి సంచారం చేశాయి. దీని కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆగస్టు 17న సింహరాశిపై ఏర్పడతోంది. దీని కారణంగా మరిన్ని రాశులవారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే చతుర్గ్రాహి యోగం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చతుర్గ్రాహి యోగం ఎలా ఏర్పడుతుందో మీకు తెలుసా?:
శుక్ర, చంద్ర, కుజ, బుధ గ్రహాలు కలిస్తే చతుర్గ్రహీ యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం కారణంగా అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశులవారిపై ప్రత్యేక యోగం ప్రభావం:
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ యోగ ప్రభావం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భౌతిక ఆనందాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో కుంటుంబ జీవితం కూడా సంతృప్తిగా మారుతుంది. వీరు భూమి-భవనాలు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందుతారు. మీడియా, రియల్ ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
మిథున రాశి:
మిథున రాశి వారికి చతుర్గ్రాహి యోగం కారణంగా విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ధైర్యం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమలంలో పెట్టుబడులు పెట్టడం మంచి లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ చేసేవారికి ఇది గొప్ప సమయంగా భావించవచ్చు. ఈ వృత్తిని అనుసరించేవారు భారీ లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ధనుస్సు రాశి:
చతుర్గ్రాహి యోగం కారణంగా సామాజికంగా మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఈ క్రమంలో సులభంగా తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతన్నారు. అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook