Chia Seeds For Weight Loss In 9 Days: చియా విత్తనాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియంతో పాటు విటమిన్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఈ గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అయితే వేగంగా బరువు తగ్గడానికి వీటిని ఎలా ఆహారంలో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చియా గింజలతో ఇలా ఆహారాలను తీసుకోండి:
చియా గింజలను రాత్రంతా పాలలో నానబెట్టి ఫ్రిజ్‌లో ఉంచి..ఉదయాన్నే అందులో అరటి, దానిమ్మ, యాపిల్ పండ్లను మిక్స్ చేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వేగంగా బరువు తగ్గాలనుకునేవారు తేనెను కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా ప్రతి రోజు అల్పాహారంలో తీసుకుంటే ఇతర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
చియా గింజలను పెరుగులో కలిపి తీసుకోవాలి:
రాత్రంతా నీటిలో నానబెట్టండి.ఉదయాన్నే పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందులోనే తాజా కొబ్బరిని కలుపుకుని తాగితే దీర్ఘకాలి వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామాలు చేసిన తర్వాత తప్పకుండా ఇలా చియా గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
మ్యాంగో చియా కంబినేషన్:
మామిడి పండు మిశ్రమాన్ని గాజు పాత్రలోకి తీసుకుని రాత్రంతా నానబెట్టిన చియా గింజలను అందులో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ఫ్రిజ్లో ఉంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఈ మామిడి మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chia Seeds For Weight Loss: చియా విత్తనాలను రోజు ఇలా తీసుకుంటే కేవలం 9 రోజుల్లో వెయిట్ లాస్ అవ్వడం ఖాయం..