ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి చేరుకుంది.
నివాసం నుంచి గంటన్నరపాటు కొనసాగిన అంతిమయాత్ర
ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముకులు నందమూరి హరికృష్ణ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
ఇంకొద్దిసేపట్లో ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తి కానున్న నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు.
నందమూరి హరికృష్ణ అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు యావత్ టాలీవుడ్ తరలివచ్చింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు నందమూరి హరికృష్ణ అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించారు.