Tomato Price Down in telugu states: నిన్న మెున్నటి దాకా ఆకాశాన్నింటిన టమాటా ధర(Tomato Price).. నేలకు దిగొచ్చింది. గత రెండు నెలలుగా చుక్కలు చూపిస్తున్న టమాటా.. ఈ రోజు మిడిల్ క్లాస్ జనానికి అందుబాటులోకి వచ్చింది. కొన్ని వారాలుగా రూ.200 నుంచి రూ.300 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు వంద రూపాయల లోపే లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో నగరంలో ఒక్కో రేటు ఉంది. హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నగరంలోని మోహిదీపట్నం రైతుబజార్లో సోమవారం కిలో టమాటా రూ.63గా పలికింది. మరోవైపు గుడిమల్కాపూర్ మార్కెట్లో అయితే కేజీ టమాటా(గోటి) రూ.50లకు అమ్ముతున్నారు. ఈ నెల చివరికల్లా టమాటా ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఏపీలోని టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విజయవాడలో రైతుబజార్లలో సోమవారం కిలోటమాటా రూ. 80 పలికింది. మెున్నటి వరకు ఏపీ ప్రభుత్వం టమాటాను సబ్సిడీపై రూ.50లకే అందించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల వ్యాపారులు పాత ధరలకే విక్రయిస్తూ సామాన్యులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఒకప్పుడు టమాటా రేటు గిట్టుబాటుకాకపోవడం వల్ల చాలా మంది పేదవారిగా మారారు. అయితే గత కొన్ని రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది రైతులు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారారు. భారీ వర్షాలు, రవాణాకు ఆటంకం, పంటలు దెబ్బతినడం తదితర కారణాల వల్ల టమాటా పంట దిగుబడి తగ్గిపోయింది. దీని వల్ల ధరలు విపరీతంగా పెరిగాయి.
Also Read: Delhi Services Bill 2023: ఎట్టకేలకు ఢిల్లీ బిల్లుకు ఆమోదం, రాజ్యసభలో ఎంపీల మధ్య వాగ్వాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook