4 Ingredients To Mix With Henna Powder For Natural Black Hair: తెల్ల జుట్టు అనే ప్రస్తుతం సాధరణ సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలా సమస్యలతో బాధపడేవారు కెమికల్ అధిక పరిమాణంలో లభించే రంగులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా హెన్నాతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ప్రతి రోజు వాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ హెన్నాలో గోరింటకు మిశ్రమం మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరి:
తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి హెన్నాను వినియోగించే క్రమంలో ఉసిరి పొడిని కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంది. అయితే ముందుగా ఓ చిన్న కప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో హెన్నాను తీసుకుని నీటితో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉసిరి పొడిని కలిపి రాత్రంతా పక్కన పెట్టి..జుట్టుకు ఉదయాన్నే అప్లై చేయడం వల్ల తొందరగా మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
కాఫీ:
సహజంగా జుట్టుకు రంగును వేసుకునే క్రమంలో చాలా మంది కేవలం హెన్నాను మాత్రమే వినియోగిస్తారు. అయితే ఇదే హెన్నాలో కాఫీ, ఇండిగో పౌడర్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీనిని వినియోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ రెమెడీని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.
గుడ్డు, నిమ్మకాయ:
హెన్నాతో గుడ్డుతో పాటు నిమ్మకాయను మిక్స్ చేసి వినియోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా మిక్స్ చేసి వినియోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా రాలడం కూడా తగ్గుతుంది. అయితే ఈ రెమెడీని తయారు చేయడానికి..ముందుగా 3 నుంచి 4 చెంచాల హెన్నాలో ఒక గుడ్డులోని తెల్లసొన, 3 చెంచాల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గంటల పాటు అలాగే పక్కన పెట్టుకుని..ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి