Iphone 14 Discount Offers: యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చే నెలలో భారత మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. ఈ మోడల్స్ మార్కెట్లోకి రాకముందే యాపిల్ ఐఫోన్ 14 ధరలు భారీగా తగ్గిపోయాయి. యాపిల్ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఐఫోన్ 14 మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ కామర్స్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 17,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ ఐఫోన్ 14 మోడల్స్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారీ తగ్గింపు ధరలతో ఐఫోన్ 14:
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 14 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900లకు విక్రయిస్తోంది. అయితే ఐఫోన్ 15 సిరీస్ విడుదలను దృష్టిలో పెట్టుకుని రూ. 11,901 వరకు కంపెనీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 67,999లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఐఫోన్‌పై అదనపు తగ్గింపు పొందడానికి బిల్ చెల్లించే క్రమంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 63,999లకే లభిస్తోంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఎక్చేంజ్ ఆఫర్:
ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 14 128GB (ప్రొడక్ట్ రెడ్) మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.12,901 ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ను రూ. 66,999లకు ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. అంతేకాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4000 తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై మరింత తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ క్రమంలో మీరు ఎక్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే రూ.61,000 వరకు బోనస్ లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌పై అన్ని ఆఫర్స్ పోను రూ.5,999లకే పొందవచ్చు.
ఐఫోన్ 14 5జి ఫీచర్స్:
✾ 6.1 అంగుళాల OLED డిస్ప్లే
✾ 12 మెగాపిక్సెల్ కెమెరా
✾ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
✾ iOS 17
✾ AirDrop సపోర్ట్
✾ డైనమిక్ ఐలాండ్ నాచ్
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి