IT Refund 2023: రేపు ఆగస్టు 31లోగా ఇ వెరిఫై చేయకపోతే ఆ 31 లక్షలమందికి రిఫండ్ రానట్టే

IT Refund 2023: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి తాజా అప్‌డేట్స్ వెలువడ్డాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అదే సమయంలో ఐటీ రిఫండ్ రాకపోవడానికి కారణాలేంటో వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 30, 2023, 01:28 PM IST
IT Refund 2023: రేపు ఆగస్టు 31లోగా ఇ వెరిఫై చేయకపోతే ఆ 31 లక్షలమందికి రిఫండ్ రానట్టే

IT Refund 2023: ఇన్‌కంటాక్స్ శాఖ అందిస్తున్న వివరాల ప్రకారం ఆగస్టు 23 వరకూ దేశవ్యాప్తంగా 6.91 కోట్లమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా, 6.59 కోట్లమంది ఇ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నారు. మరోవైపు 31 లక్షలమందికి ఐటీ రిఫండ్ రాదని, కారణమేంటో కూడా వివరించింది. 

అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 లేదా ఆర్ధిక సంవత్సరం 2022-23కు ఐటీ రిటర్న్స్ చాలామంది దాఖలు చేసుంటారు. జూలై 31 ఆఖరు తేదీలోగా రిటర్న్స్ పైల్ చేసినా ఇ వెరిఫికేషన్ ప్రక్రియ మర్చిపోయుండవచ్చు. ఇ వెరిఫై ప్రక్రియ పూర్తి చేయనివారు దేశవ్యాప్తంగా 31 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఐటీ రిఫండ్ అందదు. ఎందుకంటే ఐటీ నిబంధనల ప్రకారం ట్యాక్స్ పేయర్లంతా ఐటీఆర్ వెరిఫై చేయించుకోవాలి. వెరిఫికేషన్ జరగకపోతే ఆ రిటర్న్స్ చెల్లవు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఇ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే రిఫండ్ ప్రక్రియ జరగదు. అదే జరిగితే జరిమానాతో మరోసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఇన్‌కంటాక్స్ శాఖ లెక్కల ప్రకారం ఈనెల 23 వతేదీ వరకూ దేశవ్యాప్తంగా 6.91 కోట్లమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా అందులో 6.59 లక్షల మంది ఇ వెరిఫికేషన్ పూర్తి చేశారు. మిగిలిన 31 లక్షల మంది 30 రోజుల్లోగా ఇ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే ఐటీ రిఫండ్ రాదు. అంతేకాదు జరిమానాతో తిరికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ గడువు రేపటితో అంటే జూలై 31తో ముగియనుంది. అంటే మరొక్క రోజు మాత్రమే గడువు మిగిలుంది.

వాస్తవానికి జూలై 31తో ఐటీ రిటర్న్స్ గడువు తేదీ ముగిసింది. గడువు తేదీ తరువాత రిటర్న్స్ పైల్ చేయాలంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉంటే 1000 రూపాయలు జరిమానా ఉంటుంది. అదే వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 5 వేలు జరిమానా చెల్లించాలి. 

ఇ వెరిఫై ఎలా చేయాలి

మీరు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఇ వెరిఫికేషన్ చాలా సులభమైన ప్రక్రియ. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఇ వెరిఫై చేయవచ్చు. దీనికోసం పోర్టల్ లాగిన్ చేసి..ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇ వెరిఫై రిటర్న్స్ ప్రెస్ చేయగానే మీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది.

Also read: Earn Money: రూ.500 పెట్టుబడితో లక్షలు సంపాదించండి.. ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News