Chamomile Tea for Thyroid Problems: మనలో చాలా మంది పాలు, టీ పౌడర్ మరియు చక్కరతో చేసిన సాధారణ టీ తాగటానికి ఇష్టపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు ఇలాంటి టీ తాగటానికి బదులుగా హెర్బల్ టీ తాగమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే సాధారణ టీలలో ఉండే కెఫీన్ వలన బ్లడ్ ప్రెషర్ తో తోపాటు డయాబెటిస్ భారిన పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే మన దేశంలో ఎక్కువ మంది భాదపడుతున్న మరి రుగ్మత థైరాయిడ్ గ్రంధి లోపం. మన శరీరంలోని అది పెద్ద గ్రంధి ఇదే. ఒకవేళ ఈ థైరాయిడ్ గ్రంథిలో లోపాలు కనుక ఏర్పడితే మన పూర్తి శరీరం ప్రభావానికి లోనవుతుంది. మనము రోజు హెర్బల్ టీ తాగితే కనుక థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమం పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
థైరాయిడ్ కోసం చామంతి టీ
హార్బర్ టీ అంటే చామంతి టీ అని మా ఉద్దేశ్యం. సాధారణంగా మనం చామంతి టీ గురించి మనం విని ఉందాము కానీ దీని ఈ టీ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి చామంతి టీ సహజ ఫ్లావనాయిడ్ లను కలిగి ఉంటుంది. ఇది చాలా మొక్కల్లో కనపడే ఔషధం. చామంతి టీలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి మరియు థైరాయిడ్ సమస్యలలో నివారించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
థైరాయిడ్ సమస్యకి చామంతి టీ ఎలా ఉపయోగపడుతుంది
థైరాయిడ్ సమస్య ని తగ్గించుకోవడంలో చామంతి టీ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ తెలిపారు.
1) థైరాయిడ్ సమస్య తో బాధ పడేవారి జుట్టు తొందరగా విరిగి రాలిపోతుంది.కానీ రోజూ ఈ చామంతి టీ ని తాగడం వారి జుట్టు సమస్యలు దాదాపు తగ్గుతాయి.
2) చామంతి టీ తాగడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా తగ్గదు. కానీ,ఈ టీ థైరాయిడ్ సమస్యని తగ్గించడంలో రామబాణంలా పని చేస్తుంది.
3) ఈ హెర్బల్ టీ తాగడం వల్ల థైరాయిడ్ సమస్యల వలన కలిగే జుట్టు రాలడం, పల్చటి జుట్టు వంటి దూరం అవుతాయి.
4) అధిక బరువు తో బాధపడేవారు ఈ స్పెషల్ టీని తప్పనిసరిగా తాగాలి, దీని వల్ల పొట్ట మరియు నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.
5) డయాబెటిక్ రోగులకు కూడా ఈ హెర్బల్ టీ ఎంతగానో సహాయపడుతుంది. దీనిని తాగడం వల్ల రక్తంలో ఉండే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
6) దీనిని తాగడం వల్ల మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.ఎందుకంటే చామంతి టీ లో టెన్షన్ మరియు ఒత్తిడి ని తగ్గించే గుణాలు ఉంటాయి. దీనిని తాగడం వల్ల తాజా అనుభూతి కూడా కలుగుతుంది.
Also Read: Health Tips: శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook