Anant Chaturdashi 2023 date: హిందువులు ముఖ్యమైన పండుగలలో అనంత చతుర్దశి ఒకటి. ఈ పండుగను ప్రతి ఏటా భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ విష్ణువుకు అంకితం చేయబడింది. పది రోజులపాటు నిర్వహించే గణేష్ చతుర్థి పండుగ చివరి రోజున(గణేశుడి నిమజ్జనం రోజున) అనంత చతుర్దశిని జరుపుకుంటారు. దీనినే గణేష్ చౌదాస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ ను జైనులు కూడా జరుపుకుంటారు.
ఈ ఏడాది ఈ పర్వదినాన్ని(Anant Chaturdashi 2023) సెప్టెంబరు 28న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతోపాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అనంత చతుర్దశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మీరు పాపాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అనంత చతుర్దశి శుభ సమయం, ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
శుభ సమయం
హిందూ పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని చతుర్దశి తిథి సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 10.18 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 06.49 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, సెప్టెంబర్ 28న అనంత చతుర్దశి జరుపుకుంటారు. ఈరోజున శుభ సమయం ఉదయం 06:12 నుండి సాయంత్రం 06:49 వరకు ఉంటుంది. ఈ దినాన నారాయణుడిని పూజించి రక్షా సూత్రాన్ని కట్టుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. నేపాల్, బీహార్ మరియు తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను జరుపుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook