Jailer-2 Movie Update: సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో హిట్ ట్రాక్ పట్టాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత తలైవా కొట్టిన దెబ్బకు బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఏకంగా జైలర్ సినిమా రూ.600 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. రోబో తర్వాత ఆ స్థాయి హిట్ పడింది ఈ సినిమాతోనే. రజినీ సినిమాకు థియేటర్ల ముందు హౌస్ పుల్ బోర్డులు చూసి చాలా ఏళ్లే అయింది. అది జైలర్ తో తీరింది. కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ రజినీకి సమానమైన ఫ్యాన్ బేస్ ఉంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక రజనీ క్రేజ్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. జైలర్ తో మళ్లీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు.
జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్లో నెల్సన్ దానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. అంతేకాకుండా జైలర్ 2 స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా జైలర్-2కు సంబంధించిన ఓ క్రేజ్ అప్ డేట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. జైలర్-2 కోసం నెల్సన్ కు నిర్మాత కళానిధి మారన్ అడ్వాన్స్ రూపంలో కళ్లుచేదిరే చెక్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ చెక్ అక్షరాల రూ.55 కోట్లట. ఒక దర్శకుడికి ఇంత పెద్ద మెుత్తంలో అడ్వాన్స్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. అడ్వాన్స్ ఇంత ఉంటే.. అసలు ఇంకెంత ఉంటుందో ఆడియెన్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ చేస్తోంది.
రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాప్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే జైలర్-2 కంటే ముందు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు నెల్సన్. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ను కలిసి కథ వినిపించాడట. అయితే ఫైనల్ నెరేషన్ నచ్చక పోవడంతో బన్నీ ఈ ప్రాజెక్టు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also read: SRK VS PRABHAS: సలార్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. షారుఖ్ తో ఢీకొట్టనున్న ప్రభాస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook