Oppo A2x Launch: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Oppo రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo A2x చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మార్చ్ లో లాంచ్ అయిన OPPO A1x తరువాతి వర్షన్ గా ఈ మొబైల్ రానుంది. Oppo A2x అనేది.. 90Hz డిస్ప్లే, డైమెన్సిటీ చిప్సెట్, పెద్ద బ్యాటరీ మరియు 256GB వరకు స్టోరేజ్ వంటి కీలక ఫీచర్లతో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు..
OPPO A2x స్పెసిఫికేషన్స్
Oppo A2x 6.56 అంగుళాల LCD డిస్ప్లే, టియర్‌డ్రాప్ నాచ్‌ను కూడా కలిగి ఉంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 720 x 1612 పిక్సెల్, ఇది HD+ మరియు 90Hz రిఫ్రెష్ రేట్, 720 nits వరకు బ్రైట్నెస్, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌ను అందిస్తుంది. ఈ డిస్ప్లే ఫోన్‌ని కళ్లకు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ఫోన్ ColorOS 13.1- ఆండ్రాయిడ్ 13 పై నడుస్తుంది. ఈ ఫోన్ సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
OPPO A2x బ్యాటరీ
Oppo A2x 6GB, 8GB LPDDR4x RAM 128GB, మరియు 256GB UFS 2.2 వివిధ రకాల స్టోరేజ్ క్యాపబిలిటీతో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ ద్వారా నడుస్తుంది. బ్యాటరీ 5,000mAh అని ఉండగా.. బ్యాటరీ సామర్థ్యం గురించి ఇంకా సమాచారం అందుబాటులో లేదు.
Also Read: Top Load Washing Machine: ఈ హాట్ డీల్ మీ కోసం..అతి తక్కువ ధరకే 8Kg టాప్ లోడ్ వాషింగ్ మెషిన్..
Oppo A2x యొక్క కెమెరాల గురించి అధికారిక లిస్టింగ్‌లో ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. TENAA విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమెరా LED ఫ్లాష్‌తో 13 మెగాపిక్సెల్‌గా ఉండవచ్చని.. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా 5-మెగాపిక్సెల్‌గా ఉండవచ్చని సమాచారం. ఫోన్ సైజ్ 63.8 x 75.1 x 8.12 mm మరియు బరువు 185 గ్రాములు.
Oppo a2x ధర
Oppo A2x స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 14 తరువాత నుండి అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ గురించి గ్లోబల్ లాంచ్ ఎలాంటి సమాచారం లేదు. ఇది రెండు విభిన్న కాన్ఫిగరేషన్లను కలిగి ఉంది. 6 GB RAM + 128 GB స్టోరేజీ మరియు 8 GB RAM + 256 GB స్టోరేజీ గా ఉంది. వీటి ధర వరుసగా 1,099 యువాన్ (రూ. 12,735) మరియు 1,399 యువాన్ (రూ. 16,231). ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు పర్పుల్ రంగులో అందుబాటులో ఉండనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి