Kishan Reddy: కేసీఆర్‌వి పగటి కలలు.. ఓ తెలంగాణ సమాజమా? అర్థం చేసుకో..: కిషన్ రెడ్డి పిలుపు

Kishan Reddy Slams CM KCR: సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని.. తన కొడుకును ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 14, 2023, 04:56 PM IST
Kishan Reddy: కేసీఆర్‌వి పగటి కలలు.. ఓ తెలంగాణ సమాజమా? అర్థం చేసుకో..: కిషన్ రెడ్డి పిలుపు

Kishan Reddy Slams CM KCR: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఉత్పత్తి, విదేశీ విధానం, దేశంలో మౌలిక వసతుల కల్పన లాంటి అనేక అంశాల్లో గత తొమ్మిదేళ్లుగా జరిగిన అభివృద్ధిని మనం గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లక్షా 20 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో రహదారుల కోసం వెచ్చించారని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గతంలో కరెంట్​ కొరత ఉండేదని.. ఇప్పుడు ఏ రాష్ట్రంలో విద్యుత్​ కోతలు లేవన్నారు. వ్యవసాయ, పారిశ్రామీకరణ రంగాలకు సరిపోను కరెంట్​ ఈ దేశంలో ఉందన్నారు. విద్యుత్​ కోతలు లేని దేశాన్ని మోదీ ఆవిష్కరించారని చెప్పారు.

"ఉత్తర భారత్​ నుంచి దక్షిణ భారత్​ వరకు పవర్​ గ్రిడ్​ ఏర్పాటు చేసింది కేంద్రం.. తెలంగాణలో కూడా ఎన్టీపీసీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేసిన దాన్ని జాతికి అంకితం చేశారు. నీటిపై సోలార్​ పవర్​ ప్లాంట్‌ను తెలంగాణలో మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఒకప్పుడు డబ్బులు ఇచ్చినా.. ఎరువుల కోసం రాత్రింభవళ్లు క్యూలైన్లలో ఉండాల్సి వచ్చేది. తెల్లవారు జామున 4 గంటలకే రైతులు వచ్చి చెప్పులు క్యూ పెట్టే వారు. ఈ రోజు పరిస్థితి మారింది. రైతులకు సరిపోను ఎరువులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. యూరియా ఎక్కువ వాడితే.. భూమి దెబ్బతింటుందని భావించి నీమ్​కోటెడ్​ యూరియాను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. 

250 రూపాయలు ఒక బస్తాకు రైతు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 వేల వరకు సబ్సిడీ భరిస్తోంది. ఒక ఎకరానికి ఒక ఏడాదికి మోదీ ప్రభుత్వం 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. ఎరువుల కొరత లేనిది నూతన భారతవానిని మోదీ ఆవిష్కరించారు. మన రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం వస్తే.. మన ముఖ్యమంత్రి ఫామ్‌​హౌజ్‌​లో ఉన్నారు. మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తే.. కేసీఆర్​ ప్రగతిభవన్‌​లో ఉన్నారు.

తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన తప్ప.. తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్‌​కు చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలి. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం జరిగింది. కేసీఆర్​ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్​ పేరుతో 30 వేల కోట్ల బడ్జెట్‌​ను లక్షా 50 వేల కోట్లకు తీసుకువెళ్లారు. అంతా చేస్తే ఆ ప్రాజెక్టుకు ఫీసిబిలిటి లేదు. కరెంట్​ బిల్లులు కట్టలేని పరిస్థితి. వచ్చే నీళ్లకు, పండే పంటకు పొంతన లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఫామ్‌​హౌజ్​ ఇంజనీర్‌​గా మారి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను ముంచారు..

ఓ తెలంగాణ సమాజమా..? అర్థం చేసుకో.. బీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్రంలో వేల కోట్లతో ఓటర్లను నాయకులను కొని తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్​ ఫామ్‌​హౌజ్‌​లో పగటి కలలు కంటున్నారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రమే అప్పు ఇచ్చింది. మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చింది. విద్యుత్​ ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చింది. 9 ఏండ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అండగా నిలబడుతుంది.." అని కిషన్ రెడ్డి అన్నారు.  

Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x