Burn Belly Fat In 10 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీంతో సులభంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతున్నాయి. బాడీలోని విపరీతమైన కొవ్వు పెరిగిపోవడం కారణంగా బరువు పెరగడంతో పాటు బెల్లీ ఫ్యాట్ సమస్యల బారిన పడుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి:
భోజనం తర్వాత హెర్బల్ టీ తాగండి:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు లైట్ ఫుడ్స్, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలు తీసుకున్న తర్వాత సోపుతో చేసిన హెర్బల్ టీ తాగడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
శరీరానికి సూర్యరశ్మి చాలా అవసరం:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి..తప్పకుండా కొంత సమయం సూర్యకాంతిలో ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా సిర్కాడియన్ రిథమ్ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట సూర్యరశ్మిలో ఉండాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
కెఫీన్ కలిగిన కాఫీలు తాగొద్దు:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో నిద్రకు 3 నుంచి 4 గంటల ముందు టీ లేదా కాఫీ తాగుతున్నారు. ఇలా తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా శరీర బరువు కూడా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
సరైన సమయంలో పడుకోవాలి:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు లేట్ నైట్ పడుకుంటున్నారు. ఇలా పడుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా 9 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
లంచ్‌లో హెల్తీ సూప్ తీసుకోవాలి:
బెల్లీ ఫ్యాట్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఉదయం అల్పాహారంలో హెల్తీ ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రీన్‌టీలను ప్రతి రోజు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారాలు తీసుకునే క్రమంలో అధిక పరిమాణంలో పోషకాలు కలిగిన ఆహారాలతో తయారు చేసిన సూప్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook