Narak Chaturdashi 2023 Importance and Muhurat: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని చతుర్దశి రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 11న నరక చతుర్దశి వచ్చింది. ఈ రోజునే శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి సుమారు 16 వేల మంది మహిళలకు విముక్తి కలిగిస్తాడు. కృష్ణుడు సాధించిన విజయానికిగాను నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ రోజు శ్రీకృష్ణుడి భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. అయితే ఏయే సమయాల్లో ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరమో, నరక చతుర్దశి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నరక చతుర్దశి 2023 శుభ సమయం:
చతుర్దశి తిథి నవంబర్ 11న మధ్యాహ్నం 1:57 గంటలకు ప్రారంభమవుతుంది. 12 నవంబర్ 2023న మధ్యాహ్నం 02:44 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
నరక చతుర్దశి విశిష్టత:
నరక చతుర్దశి రోజు ప్రత్యేక సమయాల్లో వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోజుయ భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు.
అభ్యంగ స్నాన సమయం:
నరక చతుర్దశి అభ్యంగ స్నానాన్ని ఆచరించేవారు కేవలం ప్రత్యేక ముహూర్తాల్లో చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ 11న ఉదయం 05:27 నుంచి ఉదయం 06:40లోపు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
కాళీమాత పూజ ముహూర్తం:
సాయంత్రం 11:38 నుంచి నవంబర్ 12 ఆర్దరాత్రి 12:31 వరకు..
పూజ ముహూర్తం వ్యవధి: 53 నిమిషాలు
ఈ సమయాల్లో మాత్రమే దీపాలు వెలిగించాలి:
నరక చతుర్దశి రోజున 14 దీపాలు వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించడం వల్ల జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు నరక చతుర్దశి రోజున యమ నామంతో దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.
నరక చతుర్దశి రోజున చేయకూడని పనులు:
నరక చతుర్దశి నాడు మృత్యుదేవతగా భావించే యమధర్మరాజును పూజిస్తారు. కాబట్టి ఈ రోజు ఏ ప్రాణికి కూడా హానికలిగించకూడదని పూరాణాల నుంచి వస్తున్న ఆనవాయితి..దీనితో పాటు ఇంటి దక్షిణ దిశలో ఎలాంటి చెత్తను కూడా ఉంచకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి