India Vs New Zealand Dream11 Prediction and Playing 11: వరల్డ్ కప్‌లో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సెమీఫైనల్ పోరు రేపు (బుధవారం) మొదలుకానుంది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి భారత్ టాప్ ప్లేస్‌లో నిలవగా.. కివీస్ 5 విజయాలతో 4వ స్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఆటతీరు ఎలా ఉన్నా.. సెమీస్‌లో మెరుగ్గా ఆడిన జట్టే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ కీలక పోరులో విజయం సాధించి.. 2019 సెమీఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. తొలిసారి వరల్డ్ కప్ ముద్దాడేందుకు న్యూజిలాండ్ సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అవుతోంది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి సెమీ ఫైనల్‌కు రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది..? పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..
పిచ్, వెదర్ రిపోర్ట్..
ముంబై వాంఖేడే పిచ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఈ పిచ్‌పై ఈ ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరదపారింది. అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు పిచ్ నుంచి సహాకారం పొందుతారు. రెండో ఇన్సింగ్స్‌లో పేసర్లు ప్రభావంతంగా బౌలింగ్ చేస్తారు. మొదటి ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడేందుకు వీలు ఉంటుంది. ఫ్లాట్ వికెట్ కావడం.. చిన్న బౌండరీలు, ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా ఎక్కువ స్కోరు చేసేందుకు ఛాన్స్ ఉంది. ఈ ప్రపంచ కప్‌లో ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు 357 పరుగులు. మంచు కారణంగా ఛేజింగ్ చేసే జట్లకు ఇబ్బందిగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. టాస్ కీరోల్ ప్లే చేయనుంది. వెదర్ విషయానికి వస్తే.. రేపు ముంబైలో వర్షం కురిసే అవకాశం లేదు. నిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
==> వేదిక: వాంఖేడే స్టేడియం, ముంబై
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం (టాస్ టైమ్)
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్, యాప్
తుది జట్లు ఇలా (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, కైల్ జేమీసన్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
IND Vs NZ డ్రీమ్11 ప్రిడిక్షన్ టిప్స్..
==> వికెట్ కీపర్: కేఎల్ రాహుల్, డెవాన్ కాన్వే
==> బ్యాటర్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేన్ విలియమ్సన్
==> ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర (వైస్ కెప్టెన్)
==> బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్.
Also Read: Ind vs Nz Semifinal: ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆధిక్యం, ఇండియా వర్సెస్ కివీస్
Also Read: Srilanka Earthquake: శ్రీలంకలో భారీ భూకంపం, 6.2 తీవ్రతతో కొలంబోలో కంపించిన భూమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి