ఉత్తరకొరియా నిర్వహించిన సైబర్ దాడితో కీలక రహస్యం వెలుగులోకి వచ్చింది. దేశ అధ్యక్షుడు కిమ్ మర్డర్ప్లాన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయ్..ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మర్డర్ప్లాన్ కు సంబంధించిన అంశంపై ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తన కథనం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన హత్యకు ద.కొరియా నావికదళం ప్లాన్ చేసినట్లు కథనంలో పేర్కొంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను మట్టుబెట్టడానికి అమెరికా- దక్షిణ కొరియాలు వేసిన ప్లాన్ కూడా హ్యాక్ ద్వారా లభించిన పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. మర్టర్ ప్లాన్ తో పాటు దక్షిణ కొరియా యుద్ధనౌకల బ్లూప్రింట్లు ఉత్తరకొరియా చేతికి చిక్కాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల నిర్మాణ కంపెనీ డేవూ షిప్ బిల్డింగ్, మారియన్ ఇంజినీరింగ్లకు చెందిన 40 వేల పత్రాలు ఉ.కొరియా చేజిక్కించుకుంది. వీటిల్లో అత్యంత కీలకమైన 60 పత్రాలు కూడా ఉన్నాయి. ఉత్తర కొరియా క్షిపణులతో తొలుత దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజేసే ప్రణాళిక కూడా వీటిల్లో ఉంది.