KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించగా 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించగా 29 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మజ్లిస్ ఆరు స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా కామారెడ్డిలో ఓడిపోయారు. అదే స్థానం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఓడిపోయారు. బీఆర్ఎస్ ఓటమిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలో బౌన్స్ బ్యాక్ అవుతామని ట్వీట్ చేసిన కేటీఆర్, గెలిచిన కాంగ్రెస్ పార్టీకు శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ లక్ అంటూ విష్ చేశారు. రెండుసార్లు తమకు అధికారమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ వెలువడిన ఫలితాలు తమకు గుణపాఠమని, తిరిగి పుంజుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ్టి ఫలితాలు చాలా నిరాశపరిచాయని, ఊహించలేదని చెప్పారు.
కౌంటింగ్‌కు కొద్దిగా ముందు హ్యాట్రిక్ లోడింగ్ 3.0 సెలెబ్రేషన్కు సిద్ధంగా ఉండమంటూ ట్వీట్ చేసి కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే బీఆర్ఎస్ జోరు కన్పించగా మిగిలిన ఎక్కడా పట్టు సాధించలేకపోయింది.
Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook