త‌మిళ 'అర్జున్ రెడ్డి' టీజర్, ఫస్ట్ లుక్ వచ్చేసింది..

త‌మిళ 'అర్జున్ రెడ్డి' టీజర్, ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Last Updated : Sep 23, 2018, 05:18 PM IST
త‌మిళ 'అర్జున్ రెడ్డి' టీజర్, ఫస్ట్ లుక్ వచ్చేసింది..

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తమిళం, హిందీలో ఈ చిత్రం రీమేక్ అవుతోంది. హిందీలో షాహిద్ కపూర్, తమిళంలో ధృవ్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా తమిళంలో అర్జున్ రెడ్డి టీజర్ విడుదలయ్యింది.

తెలుగులో హిట్టైన అర్జున్ రెడ్డి త‌మిళంలో వ‌ర్మ పేరుతో రీమేక్ అవుతుంది. తమిళ ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఈ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ధృవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు టీజ‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. క‌థానాయిక మేఘా చౌదరీ  ని బైక్‌పై ఎక్కించుకొని ధృవ్ వెళ్తున్న స్టిల్ ను పోస్ట్ చేశారు. ఇక టీజర్ సన్నివేశాలు చూస్తుంటే తెలుగు, తమిళ వర్షన్ ఒకేమాదిరిగా ఉన్నట్లు అనిపిస్తోంది.

కాగా బాల ఈ మూవీకి బాల ద‌ర్శ‌కుడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. ఈ సినిమాను ముకేశ్ ఆర్ మెహతా ఈ4 ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. రాధన్ సంగీతం సమకూరుస్తున్నాడు.  

తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

 

Trending News