Ponmudi sentenced to Three years imprisonment: తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడికి అక్రమాస్తుల కేసులో మూడేళ్లు జైలు శిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు. పొన్ముడి మరియు అతని భార్యకు కూడా ఒక్కొక్కరికి ₹ 50 లక్షల జరిమానా విధించింది కోర్టు.
డీఎంకే హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు 2006 నుంచి 2011 వరకు రూ.1.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారనే కేసులో పొన్ముడితోపాటు ఆయన భార్య విశాలాక్షిని మద్రాస్ హైకోర్టు ఈనెల 19న దోషిగా తేల్చింది. ఇదే కేసులో వారిద్దరినీ 2016లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అవినీతి నిరోధక చట్టం-1988 ప్రకారం, వారిద్దరినీ దోషులుగా ప్రకటించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ఆయనకు 30 రోజులు గడువునిచ్చింది హైకోర్టు.
70 ఏళ్ల పొన్ముడి ఆరు సారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు విల్లుపురం బెల్ట్ లో పొలిటికల్ గా మంచి పట్టు ఉంది. గత జూలైలో అక్రమ ఇసుక తవ్వకాల కేసులో పొన్ముడిని, ఆయన కుమారుడు గౌతమ్ ను ఈడీ ప్రశ్నించింది. 2006 నుంచి 2011 వరకు మైనింగ్ మంత్రిగా ఉన్న పొన్ముడి తమిళనాడు మైనర్ మినరల్ కన్సెషన్ యాక్ట్ కు విరుద్ధందా వ్యవహరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
Also Read: Covid-19 updates: దేశంలో కొత్తగా 21 జేఎన్.1 వేరియంట్ కేసులు .. 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook