Jigarthanda Double X Selected As Rotterdam Film Festival: రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ జిగర్ తండ: డబుల్ ఎక్స్’ (Jigarthanda Double X). ఈ చిత్రానికి తమిళ స్టార్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు. ఈ మూవీ 2014లో వచ్చిన ‘జిగర్ తండ’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. నవంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీ ఓ అరుదైన గౌరవం దక్కించుకుంది. నెదర్లాండ్స్‌లోని రోటర్డ్యామ్ 50వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. ఈ విషయాన్ని దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.
‘''మా ‘జిగర్తండ డబుల్ఎక్స్'' చిత్రం ప్రతిష్ఠాత్మక రోటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్లో లైమ్లైట్ కేటగిరీలో ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందంటూ కార్తీక్ ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. అయితే ఈ సినిమాతో పాటు ఇండియా నుంచి మరో సినిమా కూడా ఎంపికైంది. తమిళ మూవీ 'ఏళు కడల్.. ఏళుమలై'’ (Yezhu Kadal Yezhu Malai) కూడా ఈ ఫిలిం ఫెస్టివల్లో చోటు దక్కించుకుంది. ఇందులో తెలుగు నటి అంజలి(Anjali), మలయాళ నటుడు నివిన్ పాలీ (Nivin pauly) లీడ్ రోల్స్ లో నటించారు.
ఇక జిగర్తండ సినిమా విషయానికొస్తే.. దర్శకుడిగా ఎస్జే సూర్య.. గ్యాంగ్‌స్టర్‌గా రాఘవ లారెన్స్ కనిపించి ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ దిగ్గజ నటుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ (Clint Eastwood) అభిమాని అయిన సుబ్బరాజ్ జిగర్తండలో క్లింట్ యానిమేషన్ పాత్రను సృష్టించాడు. దీంతో ఈ సీన్ మూవీకే హైలెట్‌గా నిలిచింది. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించారు. మూవీలో షైన్ టామ్ చాకో, నిమిష సంజయన్, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాశ్ కీలకపాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read: Salaar: సలార్ చిత్రం మిస్ చేసుకున్న హీరోయిన్... ఫైనల్ గా ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook