Ajwain Leaves Benefits: వాము మొక్క మీ పెరటిలో చూడడానికి అందంగా ఉండడంతో పాటు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీని నుంచి ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని పరిశోధనల తెలింది. ఈ ఆకులు మందంగా అలాగే వాము వాసనను వెదజల్లుతుంది. వాము మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వాము ఆకుల్లో ఎన్నో రకాల రసాయనాలు దాగి ఉన్నాయి. ఈ రసాయనాల వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని పెంచడంలో, జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండేలా వాము ఉపయోగపడుతుంది.
వాము ఆకును స్నాక్ ఐటమ్స్ లో కూడా తీసుకోవచ్చు. కొంతమంది బజ్జీల తయారిలోను వేసుకుంటారు. వీటిని వివిధ రకాల కషాయాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే లేత వాము ఆకులను నమిలి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వాము ఆకును ఆహారంతో పాటు తీసుకోవడం కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Stress Relief: శారీరక ఆరోగ్యం కన్నా.. మానసిక ఆరోగ్యం ముఖ్యం.. ఈ టిప్స్ పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter