Hair Growth Tips: ఒత్తు అయినా జుట్టు కోసం మెంతులు, కలోంజీ గింజలు వాడి చూడండి!

Hair Growth Tips At Home: ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలిని ప్రతిఒక్కరు కోరుకుంటారు. దీని కోసం వివిధ రకాల ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అయితే ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించి సులభంగా మీ జుట్టును ఒత్తుగా, బలంగా తయారు చేసుకోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 11:07 AM IST
Hair Growth Tips: ఒత్తు అయినా జుట్టు కోసం మెంతులు, కలోంజీ గింజలు వాడి చూడండి!

Hair Growth Tips At Home: జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని మహిళలు, పురుషులు ఆశపడుతారు. దీని కోసం మార్కెట్‌లో లభించే వివిధ హెయిర్ ప్రొడెక్ట్స్‌ను వాడుతారు. కానీ ఎలాంటి ఫలితం లభించదు. జట్టు సమస్యలకు ప్రధాన కారణం ఆహార అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. మన ఇంట్లో దొరికే పదార్థాలు వాడటం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి మనం తెలుసుకుందాం

ఈ చిట్కా కోసం ముందుగా కలోంజీ గింజలు, మెంతులను ఉపయోగించాలి.  వీటిని ఉపయోగించి ఇలా తయారు చేసుకోవాలి... ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఇందులోకి రెండు టీ స్పూన్ల మెంతులు, రెండు టీ స్పూన్ల కాళోంజి గింజలు వేసుకొని 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాని మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి నిమ్మ‌ర‌సం కలిపి జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించాలి. గంట వ‌ర‌కు దీని ఉంచుకోవాలి. ఏదైన హెర్బ‌ల్ షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వ‌ల్ల మ‌నం జుట్టును ఒత్తుగా పెంచుకోవ‌చ్చు.

Also read: Healthy Dates: మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖర్జూరాలు తినడం వల్ల సమస్య మాయం

మెంతులు, కలోంజీ గింజలల్లో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ఇవి ఈ కుదుళ్లపై రాసుకోవడం వల్ల కొన్ని ఔషధ గుణాలు మీ జుట్టుకు బలాన్ని, రంగు పెరిగేలా చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా జుట్ట రాలిపోవడం, తెలుపు రంగులో జుట్టు మారడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Ajwain Leaves: వాము ఆకుతో న్యూమోనియా సమస్య నుంచి తక్షణ ఉపశమనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News